ఆర్‌ఆర్‌ఆర్‌ ఆసక్తికర అప్‌డేట్‌  

Interesting Update About Rajamouli\'s Rrr Movie-alia Bhatt,jr Ntr,rajamouli,ram Charan,rrr Movie,rrr Movie Release Date,telugu Viral News,viural In Social Media

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, చరణ్‌లు హీరోలుగా రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం కోసం ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ప్రెస్‌ మీట్‌లో రాజమౌళి అన్ని విషయాలు క్లీయర్‌గా చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. జక్కన్న సినిమాలు ఎక్కువగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతాయి...

ఆర్‌ఆర్‌ఆర్‌ ఆసక్తికర అప్‌డేట్‌-Interesting Update About Rajamouli's RRR Movie

అయితే సినిమా కథ రీత్యా ఈ చిత్రంలోని ఎక్కువ భాగంను ఉత్తర భారతదేశంలో చేయాలని భావిస్తున్నారు. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రల్లో అనేక లొకేషన్స్‌లో దాదాపు రెండు నెలల షెడ్యూల్‌కు ప్లాన్‌ చేశారు.

నేటి నుండి అక్కడ చిత్రీకరణ జరుపబోతున్నారు. ఎన్టీఆర్‌ మరియు చరణ్‌లు ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు.

ఎన్టీఆర్‌ విమానం టికెట్లను ట్వీట్‌ చేశాడు. ఇక చరణ్‌ కూడా వెళ్తున్నట్లుగా సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ షెడ్యూల్‌లోనే హీరోయిన్స్‌ ఎంట్రీ కూడా ఉంటుందని సమాచారం అందుతోంది..

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నేటి నుండి ఆలియా భట్‌ షూటింగ్‌లో పాల్గొనబోతుంది. రికార్డు స్థాయి బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంను డిసెంబర్‌ వరకు పూర్తి చేయాలనే పట్టుదలతో దర్శకుడు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ కలయిక ఒక సంచలనం, అలాంటిది రాజమౌళి వారిద్దరిని డైరెక్ట్‌ చేయడం మరో సంచలనంగా భావిస్తాం. ఇంతటి రికార్డులు ఉన్న సినిమాను జులై 31న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. తప్పకుండా ఇదో అద్బుత చిత్రంగా నిలుస్తుందని, బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేస్తుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది.

400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసే అవకాశం ఉంది.