ఆ సినిమా రిజల్ట్ కోసం చిరంజీవి ఎదురు చూస్తున్నారా..?

సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత ఏడాదిన్నర గ్యాప్ తో చిరంజీవి కీలక పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమా ఈ ఏడాది మే నెల 13వ తేదీన విడుదల కానుంది.నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Interesting Update About Chirajeevi Ram Charan Acharya Movie , Chiranjeevi, Ram-TeluguStop.com

అయితే చిరంజీవి ఈ సినిమా కంటే రెండు వారాల ముందు విడుదల కాబోతున్న విరాటపర్వం సినిమా రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ సినిమా కూడా నక్సలిజం బ్యాక్ డ్రాప్ తోనే తెరకెక్కడంతో విరాటపర్వం సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందోనని చిరంజీవి ఎదురు చూస్తున్నట్టు సమాచారం.

రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫలితం కోసం ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.నీదినాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

మరోవైపు ఆచార్య సినిమాలో చరణ్ పాత్రకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

Telugu Aacharya Climax, Acharya, Chiranjeevi, Kajal, Koratala Siva, Pooja Hegde,

ఈ సినిమాలో చిరంజీవిని కాపాడే పాత్రలో చరణ్ నటిస్తున్నారని తెలుస్తోంది.సినిమాలో ఇంటర్వెల్ సమయంలో చరణ్ ఎంట్రీ ఇస్తాడని పోలీసులు చరణ్ పై అటాక్ చేసే సమయంలో చరణ్ ఎంట్రీ ఉంటుందని కొరటాల శివ ఎవరూ ఊహించని ట్విస్ట్ తో చరణ్ ఎంట్రీని ప్లాన్ చేశారని సమాచారం.సినిమాలో చిరంజీవి ప్రభుత్వ ఉద్యోగిగా, నక్సలైట్ గా రెండు పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది.

చిరంజీవికి జోడిగా కాజల్, చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.కొరటాల శివ తెరకెక్కించిన సినిమాలన్నీ హిట్లు కావడంతో ఆచార్య సినిమా చిరంజీవి కెరీర్ లో, చరణ్ కెరీర్ లో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube