చిరంజీవి రీమేక్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

 Interesting Title For Chiranjeevi Lucifer Remake-TeluguStop.com

కొరటాల శివ సామజిక అంశాన్ని ఎంచుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ మీద కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించారు.

 Interesting Title For Chiranjeevi Lucifer Remake-చిరంజీవి రీమేక్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్, రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది.ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని మే 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో నటించబోతున్నాడు. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Telugu Chiranjeevi, Interesting Title, Interesting Title For Chiranjeevi Lucifer Remake, Kingmaker, Lucifer Remake-Latest News - Telugu

లూసిఫర్ సినిమాను ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే డైరెక్టర్ మోహన్ రాజా లూసిఫర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసినట్టు సమాచారం.ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో కీలక మార్పులు చేసారని తెలుస్తుంది.ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇక చిరంజీవి ఈ సినిమా మొత్తం పంచెకట్టులోనే కనిపించబోతున్నాడు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి చాలా టైటిల్స్ వినిపిస్తున్నాయి.కానీ ఇంత వరకు అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఒక కొత్త టైటిల్ ను ఫిక్స్ చేసారని వార్తలు వినిపిస్తుంది.కింగ్ మేకర్అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్ వస్తుంది.

చూడాలి మరి ఇందులో కూడా నిజమెంతో.

#Chiranjeevi #Kingmaker #Lucifer Remake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు