రాజీవ్ కనకాలతో పెళ్లికి కండీషన్ పెట్టిన మామ.. యాంకర్ సుమ ఏం చేసిందంటే?

టాలీవుడ్ ఫేమస్ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే ఆమె ఓ ఇంటి కోడలిగా, యాంకర్ గా, సినీ నటిగా ఇలా ఎన్నో మోసుకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

 Anchor Suma Interesting Things About Her Love Marriage With Rajiv Kanakala ,  Su-TeluguStop.com

యాంకరింగ్ విషయంలో ఈమె తర్వాతే ఎవరైనా.తన మాటలతో, డైలాగులతో ఆమె చేసే మాయ మాటల్లో చెప్పలేనిది.

అంతేకాకుండా ఆమె చేసే కామెడీ పంచులు అంతా ఇంతా కాదు.ఇక ఇదిలా ఉంటే ఆమె తన భర్త రాజీవ్ కనకాల తో పెళ్లికి తన మామ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా.

యాంకర్ సుమ మార్చి 22 న పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకోగా.ఆమె 46 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టింది.కానీ ఇప్పటికీ పాతికేళ్ళ అమ్మాయిగా ఫీలవుతూ ప్రతి ఒక్కరితో సుమక్క అని పిలిపించుకుంటుంది.ఇక ఆమె మలయాళీ అయినా తెలుగువారైన సినీ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే సుమ గురించి తెలియందేముంది చెప్పండి.నేరుగా రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల కు ఫోన్ చేసి మరీ తన ప్రేమ గురించి తెలుపగా దేవదాస్ కనకాల సుమ కు ఓ కండిషన్ కూడా పెట్టారు.

ఈ విషయం గురించి దేవదాస్ కనకాల గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలుపగా.మీ అబ్బాయి, నేను ప్రేమించుకుంటున్నాం.మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని సుమ ఓ రోజు నాకు ఫోన్ చేసి చెప్పిందని తెలిపాడు.

Telugu Devdas Kanakala, Love Mariige, Rajiv Kanakala, Suma Law, Suma Kanakala, S

కానీ అప్పటికే వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తాము గ్రహించారట‌.అయితే సుమకు మాత్రం ఓ విషయం క్లారిటీగా చెప్పారట దేవదాస్ కనకాల.నువ్వు మీ అమ్మ నాన్న లకు ఒక్కగానొక్క కూతురివి.

మీ వాళ్ళు ఒప్పుకుంటేనే రాజీవ్ తో నీ పెళ్లి జరుగుతుంది.లేదంటే మాత్రం ఈ పెళ్లి గురించి మర్చిపో అని సుమ కు కండీషన్ పెట్టారట.

కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోకానీ కొన్ని రోజుల తర్వాత సుమ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ల పెళ్లి గురించి మాట్లాడారని తెలిపాడు.ఇక 1999లో వాళ్ల పెళ్లి చేశామంటూ దేవదాసు చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా ఆయనను సుమ ఫాదర్ ఇన్ లా అని కొందరి పిలిచినప్పుడు చాలా గర్వంగా ఉండేదని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube