వరుస బీజేపీ కీలక నేతల పర్యటనతో ఆసక్తిగా తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా అధికార, ప్రతిపక్షాల విమర్శలు ప్రతివిమర్శలతో ఆసక్తికరంగా మారాయి.టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ బండి సంజయ్ అరెస్ట్ తరువాత మరింతగా జోరు పెంచిన విషయం తెలిసిందే.

 Interesting Telangana Politics With A Series Of Visits By Key Bjp Leaders Bjp Te-TeluguStop.com

బీజేపీ జాతీయ కీలక నేతలను తెలంగాణకు ఆహ్వానిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతను మరింత పెంచేలా కార్యాచరణను రూపొందించుకుంటున్న పరిస్థితి ఉంది.అయితే బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామ్యకమని ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారని బీజేపీ పార్టీ నేతలు ప్రతి ఒక్క సభలో వ్యాఖ్యానిస్తూ రాజకీయంగా హీట్ ను పెంచుతున్న పరిస్థితి ఉంది.

అయితే బీజేపీ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్న రీతిలో వ్యవహరిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే జెపీ నడ్డా లాంటి కీలక నేతలు పర్యటిస్తున్న క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ నేడు వరంగల్ లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే సభలో పాల్గొన్న విషయం తెలిసిందే.అయితే బీజేపీ పార్టీ  కీలక నేతలు పర్యటనలో కూడా బీజేపీ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.ప్రతి ఒక్క కీలక జిల్లాలో జాతీయ నేతలు పర్యటించేలా బీజేపీ తమ కార్యాచరణను రూపొందించుకుంటోంది.

తాజాగా జెపీ నడ్డా హైదరాబాద్ లో పర్యటించగా, తరుణ్ చుగ్, ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ కరీంనగర్ లో పర్యటించగా నేడు అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ వరంగల్ లో పర్యటిస్తున్న పరిస్థితి ఉంది.అయితే బండి సంజయ్ అరెస్ట్ అంశంతో మొదలైన రాజకీయ వేడిని చల్లారనీయకుండా బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube