సమంత ఒక్కో పచ్చబొట్టు వెనక ఒక్కో ఇంట్రెస్టింగ్ స్టోరీ !

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ విదితమే.అయితే, మొన్నటి వరకు వీరు విడిపోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా, ఇప్పుడు విడిపోవడానికి గల కారణాలేంటి, సమంతకు ఎంత భరణం ఇస్తున్నారు అనే శీర్షికలతో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 Interesting Stories Behind Samantha Tattoos Details, Samantha, Samantha Tattoos-TeluguStop.com

అయితే, నాగచైతన్య, సమంత విడిపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.కలిసి మెలిసి ఉండాల్సిందని అంటున్నారు.

ఇకపోతే సమంత, నాగచైతన్య పదేళ్ల పాటు ప్రేమించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.కాగా, ఈ సమయంలో నాగచైతన్య ప్రేమకు గుర్తుగా సమంత తన శరీరంలోని పలు ప్రాంతాలపై పచ్చబొట్లు కొట్టించుకుంది.

మూడు టాటూలను వేసుకుంది.వీటిని పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రదర్శించింది కూడా.

కాగా సమంత వేసుకున్న ఆ టాటూలకు స్పెషల్ మీనింగ్ ఉందట.తన మాజీ భర్త నాగచైతన్య కోసం పచ్చబొట్లు కొట్టించుకుంది సమంత.

సమంత వీపు‌పై భాగంలో వైఎంసి అని ఉంటుంది.దీని అర్థం నాగచైతన్య, సమంత తొలిచిత్రం ‘ ఏ మాయ చేశావే’.

ఈ చిత్రం తర్వాతనే వీరు ప్రేమలో పడ్డారు.ఇది ఇద్దరికి చాలా ముఖ్యమైన చిత్రం.

రెండో టాటూ సమంత కుడి పక్కటెముకపై ఉంటుంది.అక్కడ ‘ఛయ్’ అని రాసి ఉంటుంది.

అంటే సమంతకు నాగచైతన్యపై ఉన్న ఇష్టం తెలిపేందుకుగాను అక్కడ అలా రాసుకుందట.ఇక సమంత, నాగచైతన్య ఇద్దరూ తమ ముంజేతులపై రెండు బాణాలు టాటూగా వేసుకన్నారు.

Telugu Naga Chaitanya, Samanth, Shaakuntalam, Tollywood-Movie

ఈ పచ్చబొట్టు అర్థం చై సామ్ కలిసి మెలిసి ఉంటారని చెప్పడమేనట.అయితే, పెళ్లి అయిన నాలుగేళ్లకే నాగచైతన్య, సమంత విడిపోయారు.వీరద్దరు కూడా ప్రొఫెషనల్ కెరీర్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.నాగచైతన్య ప్రస్తుతం ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుండగా, నెక్స్ట్ ‘థాంక్యూ’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.

ఇకపోతే చైతన్య ఫిల్మ్ ‘లాల్ సింగ్ చద్దా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్, సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

సమంత పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ షూట్ కంప్లీట్ చేసింది.ఈ చిత్రంలో సమంత పౌరాణిక పాత్ర ‘శకుంతల’గా లీడ్ రోల్ ప్లే చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube