శ్రీరామనవమి కానుకగా పట్టాభిషేకం స్టిల్ విడుదల !

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్.ఇంక అప్పటి నుండి వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

 Interesting Still Out From Prabhas Adipurush-TeluguStop.com

రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే మరొక మూడు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు.

 Interesting Still Out From Prabhas Adipurush-శ్రీరామనవమి కానుకగా పట్టాభిషేకం స్టిల్ విడుదల -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా ప్రకటించాడు.

ఈ సినిమా కూడా భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు.ఈ సినిమాతో పాటు ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆది పురుష్ సినిమా ను ప్రకటించాడు.

ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.ఒక వైపు సలార్ సినిమా షూటింగ్ చేస్తూనే మరో వైపు ఆది పురుష్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించేసారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా, సీత గా కృతి సనన్ నటిస్తున్నారు.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా నుండి త్వరలో అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.శ్రీరామనవమి కానుకగా ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఎలాంటి లుక్ రివీల్ చెయ్యాలని ఆలోచిస్తున్న సమయంలో ఒక ఐడియా వచ్చిందట.రాముని పట్టాభిషేకం జరిగే స్టిల్ ను విడుదల చేయాలనీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

మరి చూడాలి శ్రీరామనవమి కానుకగా ఎలాంటి లుక్ రివీల్ చేస్తారో.

#Prabhas #Adipurush #Sri Rama Navami

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు