ప్రభాస్ రాముడి లుక్ రివీల్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు.ప్రెసెంట్ ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

 Interesting Still Out From Prabhas Adipurush-TeluguStop.com

అందులో మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.ఒకేసారి మూడు సినిమాల షూటింగ్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు.

ఆ మూడు సినిమాల్లో ఆదిపురుష్ సినిమా ఒకటి.ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు.

 Interesting Still Out From Prabhas Adipurush-ప్రభాస్ రాముడి లుక్ రివీల్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్నారు.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా నుండి త్వరలో అదిరిపోయే అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది.ఈ సినిమాలో రాముడి లుక్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తమ అభిమాన హీరో రాముడి లుక్ లో ఎలా ఉంటాడా ఓం రౌత్ ఎలా ప్రెసెంట్ చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు.అయితే అభిమానుల ఎదురు చూపులకు ఫలితం త్వరలోనే రాబోతుందని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి రాముడి లుక్ ను రివీల్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ స్టన్నింగ్ లుక్ చూడడానికి అభిమానులు రెడీ అవుతున్నారు.

మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

#Radhe Shyam #Adipurush #Salaar #Prabhas Rama #Kriti Sanon

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు