ఆర్ఆర్ఆర్‌లో అదే హైలైట్ అంటోన్న జక్కన్న

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా వారు ఆతృతగా చూస్తున్నారు.

 Interesting Sequence In Rrr Says Rajamouli-TeluguStop.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాకుండా మిగతా ఇండస్ట్రీల్లో కూడా ఆసక్తి ఏర్పడింది.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో వీరిద్దరు కలిసి చేసే ఫైట్ సీక్వెన్స్ చిత్రానికే హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది.

అడవి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ ఫైట్ సీక్వెన్స్‌ భారీ స్థాయిలో తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.భారీ క్యా్స్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాలోనే చాలా గ్రాండ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలివియా మోరిస్‌ నటిస్తోన్న ఈ సినిమాలో సముద్రకని, అజయ్ దేవ్గన్ లాంటి నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube