అలయ్- భలయ్ లో ఆసక్తికర సన్నివేశం... మొదలైన మరో ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈ విషయం రాజకీయాల్లో చాలా సార్లు ఋజువైంది కూడా.

 Interesting Scene In Alay Bhalay Etc Another-TeluguStop.com

విడి విడిగా ఎన్ని విమర్శలు, ప్రతి విమర్శలు చేసినా ఎన్నికల సమయంలో పొత్తులు కుదుర్చుకునేటప్పుడు మాత్రం అందరూ ఒక్కటిగా కలిసిపోతారు.ఇప్పటివరకు చాలా సార్లు ఇటువంటి సంఘటనలు జరిగాయి.

అలా జరిగినప్పుడు కొంత మేర చర్చ అనేది మొదలవుతుంది.తరువాత పరిస్థితులు సద్దుమణుగుతాయి.

 Interesting Scene In Alay Bhalay Etc Another-అలయ్- భలయ్ లో ఆసక్తికర సన్నివేశం… మొదలైన మరో ప్రచారం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అచ్చం ఇలాగే మరొక ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.తాజాగా గవర్నర్ బండారు దత్తాత్రేయ అధ్యక్షతన అలయ్- భలయ్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, న్యాయ ఇంకా ఇతర రంగాలలోని ప్రముఖులు హాజరైన పరిస్థితి ఉంది.  అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత కూడా హాజరైన విషయం తెలిసిందే.

అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్ కొద్ది సేపు ముచ్చటించుకున్నారు.ఇక ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.బీజేపీ, టీఆర్ఎస్ పొత్తు గురించి చర్చించుకున్నారు అని కొంత మంది వ్యాఖ్యానిస్తుండగా, మరికొంత మంది సాధారణ చర్చ మాత్రమే నని పొత్తు గురించి చర్చిస్తున్నారన్న వ్యాఖ్యలను ఖండిస్తున్న పరిస్థితి ఉంది.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @trspartyonline, Alay-bhalay, Bandi Sanjay, Bjp Party, Campaig, Mlc Kavitha, Social Media, Telangana Politics, Trs Party, Ts Poltics-Political

అయితే పార్టీలు వేరైనా ఎటువంటి రాజకీయ సంబంధం లేని సమావేశాలకు అందరూ హాజరైనప్పుడు నేతల మధ్య మాటలు జరగడం సర్వసాధారణం అని రాజకీయాలపై ఒక స్పష్టమైన అవగాహన ఉన్న వారు అభిప్రాయ పడుతున్నారు.ఏది ఏమైనా బండి సంజయ్ , కవిత మాట ముచ్చట ఇంకెన్ని ప్రచారాలకు దారి తీస్తుందో చూడాలి.ఈ ప్రచారం ఇంకెంత దూరం వెళ్తుందో ఇంకెన్ని కొత్త ప్రచారాలకు దారి తీస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.

#Bandi Sanjay #@BJP4Telangana #Trs #Mlc Kavitha #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube