అవినాష్ ఎంగేజ్మెంట్ నిజమా? కాదా?.. ఆ వీడియోతో అనుమానాలు?

జబర్దస్త్ షో ద్వారా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అవినాష్ బిగ్ బాస్ షో ఆఫర్ వల్ల ఈటీవీ ఛానల్ కు దూరమయ్యారు.అయితే స్టార్ మా ఛానల్ లో షోలు, ఈవెంట్లు, ఇతర ఆఫర్లతో అవినాష్ చాలా బిజీ అయ్యారు.

 Interesting Rumours Goes Viral About Avinash Engagement Video, Avinash, Engageme-TeluguStop.com

అవినాష్ భారీ స్థాయిలో పారితోషికాన్ని సైతం అందిపుచ్చుకుంటున్నారు.అయితే తాజాగా అవినాష్ అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ చెప్పి షాకిచ్చిన సంగతి తెలిసిందే.

అయితే స్టార్ మా ఛానల్ లో వినాయక చవితి పండుగ సందర్భంగా పండగే పండుగ పేరుతో ఒక షో ప్రసారం కానుంది.అయితే అనూజ నిజంగానే అవినాష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయా.? లేక ఈవెంట్ కోసం ఈ విధంగా ప్లాన్ చేశారా.? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.అవినాష్ షేర్ చేసిన ఫోటోలలో అవినాష్ తల్లిదండ్రులు, బంధువులు కనిపించకపోవడం వల్ల కూడా ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి.

అవినాష్ ఈవెంట్ కోసమే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడని తేలితే మాత్రం నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

అవినాష్ వీడియో గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.అవినాష్ కు నెటిజన్లలో ఎక్కువమంది పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.గతంలో పలు ఛానెళ్లలో పెళ్లి పేరుతో ఈవెంట్లు ప్రసారమైన సంగతి తెలిసిందే.

రష్మీ సుధీర్ జోడీకి, ప్రదీప్ శ్రీముఖి జోడీకి, రవికృష్ణ నవ్యస్వామి జోడీకి పెళ్లి అని జోరుగా ప్రచారం చేసి ఈవెంట్లలో మాత్రం నిరాశపరిచారు.అవినాష్ పెళ్లి గురించి నిజమో చెప్పాడో లేక అబద్ధం చెప్పాడో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.అవినాష్ అరియానాతో కలిసి కామెడీ స్టార్స్ షోలో చేసే స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

అరియానా అవినాష్ జోడీకి కూడా బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube