యుగానికి ఒక్కడు సీక్వెల్ కి సర్వం సిద్ధం... షూటింగే ఆలస్యం

పదేళ్ళ క్రితం కార్తి హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో యుగానికి ఒక్కడు సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.డిఫరెంట్ కథాంశంతో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో అప్పట్లోనే విజువల్ గ్రాండియర్ గా ఆ సినిమాని దర్శకుడు సెల్వ రాఘవన్ ఆవిష్కరించారు.

 Interesting Premise Set For Yuganiki Okkadu Sequel-TeluguStop.com

చోళులు, పల్లవుల కథకి ప్రెజెంట్ నేటివిటీ మిక్స్ చేసి సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు.చాలా మందికి ఈ సినిమా భాగా కనెక్ట్ అయ్యింది.

తెలుగు ప్రేక్షకులకి పెద్దగా ఈ సినిమా నచ్చలేదు.అయితే అప్పట్లోనే యుగానికి ఒక్కడు సినిమాకి సీక్వెల్ ఉంటుందనే విధంగా క్లైమాక్స్ లో హిట్ ఇచ్చి దర్శకుడు వదిలేశాడు.

 Interesting Premise Set For Yuganiki Okkadu Sequel-యుగానికి ఒక్కడు సీక్వెల్ కి సర్వం సిద్ధం… షూటింగే ఆలస్యం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తానని చాలా సందర్భాలలో సెల్వ రాఘవన్ చెప్పాడు.అయితే ఊహించని విధంగా గత ఏడాది కరోనా లాక్ డౌన్ టైంలో సినిమా పోస్టర్ ని లాంచ్ చేసి అఫీషియల్ గా సీక్వెల్ గా కన్ఫర్మేషన్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాలో తనతమ్ముడు స్టార్ హీరో ధనుష్ ని లీడ్ రోల్ లో తీసుకున్నాడు.మిగిలిన్ క్యాస్టింగ్ ఎవరనేది రివీల్ చేయలేదు.ఇదిలా ఉంటే ఈ సినిమా స్క్రిప్ట్ ని సెల్వ రాఘవన్ ఇప్పటికే కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది.మొదటి భాగం కంటే మరింత పకడ్బందీగా కాన్సెప్ట్ ని దర్శకుడు సెల్వ సిద్ధం చేసి తమ్ముడు ధనుష్ ని మెప్పించినట్లు తెలుస్తుంది.

ఇక ధనుష్ లో కూడా రైటింగ్ టాలెంట్ ఉండటంతో సినిమా నేరేషన్ పరంగా అతనికి హెల్ప్ చేసినట్లు కోలీవుడ్ లో వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో అన్నదమ్ముల కలయికలో అదిరిపోయే స్క్రీన్ ప్లేతో కథ సిద్ధం అయ్యిందని బోగట్టా.

ఈ ఏడాదిలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారని తెలుస్తుంది.కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి నార్మల్ అయిన తర్వాత గ్రాండ్ గా ఈ సినిమా ఓపెనింగ్ చేసి షూటింగ్ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

#Tollywoood #Dhanush #YuganikiOkkadu #Kollywood #Selvaraghavan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు