తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు నాగార్జున ( Nagarjuna ) ఒకరు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక నాగార్జున ఎక్కువగా సీనియర్ దర్శకుడు కె .రాఘవేంద్రరావు ( Raghavendra Rao ) దర్శకత్వంలో నటించారునే విషయం మనకు తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒక సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమా తాను అనుకున్న విధంగా రావడం కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తారు.
అందుకే ఈయన సినిమాలు కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకు ఉంటాయని మనకు తెలిసిందే.

ఇక నాగార్జున హీరోగా ఈయన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అన్ని ఏర్పాటు చేశారు.అయితే ఈ సినిమాలో నాగార్జునని కాస్త బొద్దుగా చూపించాలని రాఘవేంద్రరావు నాగార్జునకు శరీర బరువు పెరగమని చెప్పారట.నాగార్జున ఎంత ప్రయత్నం చేసిన తన శరీర బరువు పెరగకపోవడంతో ఈ సినిమా ఎలాగైనా సక్సెస్ కావాలి అన్న ఉద్దేశంతో ఈయన ఏకంగా నాగార్జున షర్ట్ లోపల భారీగా దూదిని( Cotton ) చుట్టి ఆయన లావుగా కనిపించేలా చేశారట అలాగే ప్యాంటులో కూడా దూదిని పెట్టి నాగార్జున లావుగా కనిపించే విధంగా ఆయనని తయారు చేశారట.
ఇలా నాగార్జున డ్రెస్ లోపల దూది పెట్టి తనని రెడీ చేయడంతో నాగార్జున అప్పుడు కాస్త బొద్దుగా కనిపించారని తెలుస్తుంది.ఇలా ఇదే లుక్ లుక్ లో సినిమాలో తన పాత్రకు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి చేశారట.
అయితే ఈ సినిమా విడుదలయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇలా సినిమా సక్సెస్ కోసం రాఘవేంద్రరావు ఎలాంటి కష్టాన్నయినా ఛాలెంజ్ గా తీసుకొని సినిమాలను తెరకెక్కిస్తారు.
ఇలా ఈయన ప్రతి ఒక్క సినిమాలో కూడా తన మార్క్ కనిపిస్తుందని చెప్పాలి.సినిమా కోసం రాఘవేంద్రరావు అంతగా కష్టపడతారు కనుక సినిమాలు కూడా మంచి సక్సెస్ అవుతుంటాయని చెప్పాలి.