సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటి శ్రీదేవి ( Sri devi ) ఒకరు.ఇండస్ట్రీలో అన్ని భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి ఈమె అకాల మరణం ఇండస్ట్రీకి తీరనిలోటని చెప్పాలి.
అయితే శ్రీదేవి మరణాంతరం తన కుమార్తె ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టారు.ఇలా జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) ధడక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
అయితే మొదటిసారి ఈమె సౌత్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కాబోతున్నారని చెప్పాలి.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర ( Devara ) సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ సౌత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా జాహ్నవి కపూర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈమె షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రాత్రి సమయంలో మాత్రం తనకు నిద్ర రాకపోతే కొన్ని వీడియోలను చూడటం తనకు పిచ్చి అలవాటుగా ఉందని తెలుస్తోంది.
నిత్యం తన చెల్లెలు ఖుషి కపూర్ తో గొడవపడే ఈమె తనకు ఎంతో ఇష్టమైనటువంటి టామ్ అండ్ జెర్రీ వీడియోలను చూస్తూ ఉంటారట.

ఇలాంటి వీడియోలు చూసే అలవాటు ఉన్నటువంటి తనకు నిద్ర పట్టకపోతే ఈ వీడియోలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారని అలాగే తన చెల్లిని కూడా టార్చర్ చేస్తూ ఉంటారని తెలుస్తోంది.ఇక తన తల్లి అంటే ఎంతో అమితమైనటువంటి ప్రేమ ఉండే జాన్వీ తరచూ తన తల్లిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టల్ పెడుతూ ఉంటారు అయితే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కంపల్సరిగా తన తల్లి ఫోటోని చూస్తూ తనకు గుడ్ నైట్ చెప్పడం ఉదయం లేవగానే తన తల్లి ఫోటోకి గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక అలవాటుగా కూడా ఉందని తెలుస్తుంది.