యానిమల్ సినిమాలు నాన్న అనే పదం అన్నిసార్లు పలికారా?

రణబీర్ కపూర్ ( Ranbir Kapoor)రష్మిక (Rashmika ) హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ( Sandeep Reddy ) వంగ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం యానిమల్(Animal ).ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల అయ్యి  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Interesting News Viral About Animal Movie, Animal Movie, Naana, Rashmika Mandann-TeluguStop.com

ఈ సినిమా థియేటర్లలో పలు విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి ఇలా థియేటర్లో ఎంతో మంచే సక్సెస్ సాధించినటువంటి ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.జనవరి 26వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.

ఇకపోతే ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయినటువంటి వారందరూ కూడా ప్రస్తుతం చూస్తున్నారు.అయితే చాలామంది సినిమాని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ సినిమాలో కొన్ని విషయాలను గురించి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.ఈ సినిమా నాన్న ( Naana ) సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సినిమా మొత్తంలో ఎన్ని సార్లు నాన్న అనే పదం వచ్చిందనే విషయం గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.

ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నాన్న అని ఏకంగా 196 సార్లు పిలిచారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతుంది.ఒక్క సినిమాలో ఒక పదం ఇన్నిసార్లు రిపీట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు.ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్, బబ్లూ పృధ్విరాజ్ వంటి తదితరులు నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 కూడా షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube