మహేష్‌ 26 గురించి ఆసక్తికర అప్‌డేట్‌... ఫ్యాన్స్‌ ఇది మీకోసమే

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నిన్న ‘మహర్షి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్లుగా ఆయన సినిమా సాగింది.

 Interesting News About Mahesh 26th Movie 26-TeluguStop.com

అద్బుతమైన స్క్రీన్‌ప్లే, భారీ యాక్షన్‌ ఎలిమెంట్స్‌, రికార్డు స్థాయి బడ్జెట్‌ అంటూ చాలా అంచనాలు పెంచారు.దాంతో సినిమా 150 కోట్ల బిజినెస్‌ చేసింది.

తీరా చూస్తే సినిమా నిరాశ పర్చింది.కలెక్షన్స్‌ వస్తాయా రావా అనే విషయంపై క్లారిటీ లేదు.

ఈ సమయంలోనే మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ సంతోషించే వార్త ఒకటి సినీ వర్గాల్లో ప్రచారం మొదలు అయ్యింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌ 26 మూవీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

మహర్షి నిరాశ పర్చిన నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మహేష్‌ బాబు రంగంలోకి దిగాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌ 26 మూవీ ఉండబోతుంది.

అనీల్‌ సుంకర నిర్మించబోతున్న విషయం తెల్సిందే.ఇక ఈ చిత్రం తప్పకుండా ఒక పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంగా ఉంటుందని అంటున్నారు.

మహేష్‌ 26 గురించి ఆసక్తికర అప్�

ఎఫ్‌ 2తో దర్శకుడు అనీల్‌ రావిపూడి తన సత్తా చాటాడు.ఇక మహేష్‌ బాబుతో ఆయన ఒక పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ మూవీని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.వచ్చే నెలలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్‌ మూడవ వారంలో సినిమాను మొదలు పెట్టి ఇదే సంవత్సరం చివరి వరకు లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో మహేష్‌ బాబు అండ్‌ కో అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube