తెలుగు, తమిళ బిగ్‌ బాస్‌ల గురించి ఆసక్తికర వార్త.. నిజమే అయితే సంచలనమే  

Interesting-news-about-bigboss-show-

బిగ్‌ బాస్‌ మూడవ సీజన్‌ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండవ సీజన్‌కు యంగ్‌ హీరో నాని హోస్టింగ్‌ చేశాడు. మూడవ సీజన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి..

తెలుగు, తమిళ బిగ్‌ బాస్‌ల గురించి ఆసక్తికర వార్త.. నిజమే అయితే సంచలనమే-Interesting-news-about-bigboss-show

అయితే హోస్టింగ్‌ ఎవరు చేస్తారు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. పదుల సంఖ్యలో పేర్లు అయితే వినిపిస్తున్నాయి కాని ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా ఖరారు కాలేదు. చిరంజీవి నుండి మొదలు పెడితే విజయ్‌ దేవరకొండ, అనుష్క వరకు ఎన్నో పేర్లను ఇప్పటి వరకు మీడియాలో ప్రసారం చేయడం జరిగింది.

కాని బిగ్‌బాస్‌ నిర్వాహకులు మాత్రం ఇప్పటి వరకు ఏ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా బిగ్‌బాస్‌ గురించి మీడియాలో ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. తెలుగు బిగ్‌బాస్‌ తోపాటు తమిళ బిగ్‌బాస్‌ కూడా త్వరలో మూడవ సీజన్‌ ప్రారంభించాల్సి ఉంది.

మొదటి సీజన్‌ మరియు రెండవ సీజన్‌కు అక్కడ కమల్‌ హాసన్‌ హోస్టింగ్‌ చేశాడు. అయితే మూడవ సీజన్‌కు ఆయన రాజకీయ కారణాల వల్ల హోస్ట్‌గా వ్యవహరించేందుకు ముందుకు రావడం లేదు. దాంతో ఆయన స్థానంను భర్తీ చేసేందుకు కూడా బిగ్‌బాస్‌ నిర్వాహకులు అక్కడ స్టార్‌ కోసం వెదుకుతున్నారు.

ఇలాంటి సమయంలో బిగ్‌బాస్‌ వారు ఇద్దరు లేడీ సూపర్‌ స్టార్‌లను తెలుగు, తమిళ బిగ్‌బాస్‌లుగా ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

బిగ్‌బాస్‌కు ఇప్పటి వరకు ఇండియాలో మేల్‌ యాంకర్‌ మాత్రమే హోస్టింగ్‌ చేయడం జరిగింది. అయితే మొదటి సారి తెలుగు కోసం అనుష్కను, తమిళం కోసం నయనతారను ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నయనతార ఇలాంటి కార్యక్రమాలపై ఆసక్తి చూపించదు.

కాని మొదటి సారి నయనతార మాత్రం భారీ పారితోషికం కారణంగా బిగ్‌బాస్‌కు ఓకే చెప్పిందని అక్కడ ప్రచారం జరుగుతోంది. ఇక ఇక్కడ అనుష్క కూడా ఇప్పటికే ఆసక్తిగా ఉందని వార్తలు వచ్చాయి. మొత్తానికి లేడీ హోస్ట్‌లతో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ప్రసారం అయితే సంచలనం నమోదు అవ్వడం ఖాయం. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..