'ఆదిపురుష్'లో సీత పాత్ర షూట్ ను పూర్తి చేసిన కృతి!

Interesting News About Adipurush Seetha 2

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.అందులో ‘ఆదిపురుష్‘ సినిమా ఒకటి.

 Interesting News About Adipurush Seetha 2-TeluguStop.com

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓం రౌత్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు డైరెక్టర్ తెలిపాడు.

 Interesting News About Adipurush Seetha 2-ఆదిపురుష్’లో సీత పాత్ర షూట్ ను పూర్తి చేసిన కృతి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ ను డైరెక్టర్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.అయితే తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న సీత పాత్ర గురించి దర్శకుడు ఓం రౌత్ ఒక విషయం సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

కృతి సనన్ ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది అని ఓం రౌత్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

ఆయన ట్వీట్ చేస్తూ ప్రియమైన కృతి మిమ్మల్ని జానకి పాత్రలో చూడడం అద్భుతంగా ఉంది.మీ భాగం షూటింగ్ అప్పుడే పూర్తి అయ్యిందంటే ఎంత అద్భుతమైన ప్రయాణం.

అంటూ కృతి రోల్ గురించి ఓం రౌత్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

అంతేకాదు ఆదిపురుష్ సెట్స్ లో కృతి చేత కేక్ కట్ చేయిస్తున్న ఫోటోలను కూడా షేర్ చేసాడు.ఈ మధ్యనే రావణుడిగా కనిపిస్తున్న సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ పూర్తి చేసినట్టు తెలిసిందే.ఇక ఇప్పుడు సీత పాత్ర షూట్ కూడా పూర్తి అవ్వడంతో మిగతా షూట్ కూడా పూర్తి అవడానికి పెద్దగా టైం పట్టేట్టుగా లేదు.

ఈ సినిమా షూట్ తొందరగా పూర్తి చేస్తే విఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మిగతా సమయం దీనికే వడబోతున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు కాబట్టి ఈ సినిమా షూట్ ను ఈ ఏడాది లోపే పూర్తి చేస్తే మిగతా సమయం అంత విఎఫ్ఎక్స్ పార్ట్ కు సరిపోతుందని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

https://twitter.com/omraut/status/1449216187695464448?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1449216187695464448%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fkriti-sanon-wraps-adipurush-shooting%2F
#Saif Alikhan #Prabhas #Adipurush #Raut #Seetha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube