ప్రముఖ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణాలు ఇవేనా?

ఈ మధ్య కాలంలో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖుల విడాకులకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.దేశంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో జంటలు విడిపోతున్నా సెలబ్రిటీ జోడీల విడాకుల వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

 Interesting Facts Behind Star Celebrities Divorce-TeluguStop.com

అయితే పేరుప్రఖ్యాతలను సంపాదించుకున్న వాళ్లు విడాకులు తీసుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.సెలబ్రిటీల విడాకులకు ప్రధానంగా ఇగో కారణమని చెప్పవచ్చు.

భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తుంటే ఇగో వార్ వచ్చే ఛాన్స్ ఉంది.అదే సమయంలో సంపాదిస్తున్న భర్త భార్యను సంపాదించడం లేదనే కారణంతో తక్కువ చేసి మాట్లాడినా కూడా ఇద్దరి మధ్య ఇగో ముదిరి విడాకులకు దారి తీసే పరిస్థితులు ఏర్పడతాయి.

 Interesting Facts Behind Star Celebrities Divorce-ప్రముఖ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణాలు ఇవేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇతరులపై ఆకర్షణ సైతం కొన్నిసార్లు సెలబ్రిటీల విడాకులకు కారణమవుతుంది.కొత్తగా ఏర్పడిన పరిచయాలు వేరే బంధానికి దారి తీసే అవకాశాలు అయితే ఉంటాయి.

మగాళ్లూ అందరూ తప్పులు చేయకపోయినా అవకాశాలను బట్టి తప్పులు చేసే మగాళ్లు అయితే ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పవచ్చు.

Telugu Celebrities, Celebrities Engagement, Celebrities Marriages, Divorce, Divorce Trend, Financial Freedom, Interesting Facts, Star Celebrities, Tollywood-Movie

అవతలి వ్యక్తి ఇష్టాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పరిమితులను విధించడం కూడా విడాకులకు ప్రధాన కారణమవుతున్నాయి.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఒంటరిగా జీవిస్తే సంతోషంగా జీవిస్తామనే భావన సైతం విడాకులకు కారణమవుతోంది.

Telugu Celebrities, Celebrities Engagement, Celebrities Marriages, Divorce, Divorce Trend, Financial Freedom, Interesting Facts, Star Celebrities, Tollywood-Movie

సెలబ్రిటీలకు ఆర్థిక స్వాతంత్రం ఎక్కువ అనే సంగతి తెలిసిందే.ఆర్థిక శక్తి ఉన్నవాళ్లు రాజీ పడి బంధాన్ని కొనసాగించడానికి ఆసక్తి చూపకపోవచ్చు.భార్యపై భర్తకు అనాసక్తి, భర్తపై భార్యకు అనాసక్తి కూడా కొన్ని సందర్భాల్లో విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణమవుతోంది.

కొంతమంది సెలబ్రిటీలు ఎంగేజ్ మెంట్ తర్వాత ఆ ఎంగేజ్ మెంట్ లను క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే.తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా ఈ విడాకుల కల్చర్ కొనసాగుతుండటం గమనార్హం.

అయితే విడిపోయిన తర్వాత తాము తీసుకున్న నిర్ణయం తప్పని బాధ పడిన జంటలు కూడా ఉండటం గమనార్హం.

#Divorce Trend #Marriages #Divorce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు