ఆ నిర్ణయమే దేవి శ్రీ ప్రసాద్ తలరాత మార్చిందా..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అనే సంగతి తెలిసిందే.ఆఫర్ల విషయంలో థమన్ ముందున్నప్పటికీ రెమ్యునరేషన్ పరంగా మాత్రం దేవి శ్రీ ప్రసాద్ ముందువరసలో ఉండటం గమనార్హం.ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కో సినిమాకు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.అయితే దేవి శ్రీ ప్రసాద్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయమే దేవి శ్రీ ఈ స్థాయిలో ఉండటానికి కారణమైంది.

 Interesting Facts Behind Devi Sri Prasd First Movie Chance-TeluguStop.com

దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన దేవి శ్రీ ప్రసాద్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.

అయితే దేవి శ్రీ ప్రసాద్ కు తొలి సినిమా ఆఫర్ రావడం వెనుక చాలా పెద్ద కథ ఉంది.ఒక సందర్భంలో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ తన ఫస్ట్ ఛాన్స్ గురించి వెల్లడించారు.

దేవి శ్రీ ప్రసాద్ కు తొలి సినిమా ఆఫర్ ఇచ్చిన ఎమ్మెస్ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

Telugu Devi Sri Prasad, Offers, Raju-Movie

దేవి సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట్లో చాలామందిని అనుకున్నామని ఎమ్మెస్ రాజు తెలిపారు.ఇళయరాజా ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆ సినిమాకు ఆయనను ఫిక్స్ చేయాలా ? వద్దా ? అనే ఆలోచనలో పడ్డానని తెలిపారు.ఆ తరువాత సత్యమూర్తి (దేవి శ్రీ ప్రసాద్ తండ్రి) ఇంటికి వెళ్లానని కీ బోర్డ్ సౌండ్ వినిపించడంతో కీ బోర్డ్ ప్లే చేస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ను చూసి సాంగ్స్ కంపోజ్ చేయమని చెప్పానని దేవి శ్రీ కంపోజ్ చేసిన సాంగ్ తనకు నచ్చిందని ఎమ్మెస్ రాజు అన్నారు.

ఆ తర్వాత దేవి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ఎంపికయ్యాడని ఆ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఇచ్చాడని ఎమ్మెస్ రాజు అన్నారు.ఆ సినిమా సమయంలో దేవి శ్రీ ప్రసాద్ వయస్సు కేవలం 17 సంవత్సరాలని చెప్పారు.

ఆ ఒక్క నిర్ణయం దేవి శ్రీ ప్రసాద్ జీవితాన్ని మార్చేసిందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube