పంచ సరోవరాలు అంటే ఏమిటో తెలుసా?

మన దేశంలో తీర్థయాత్రలకు ఎంతో ప్రాముఖ్యత నెలకొంది.ఈ తీర్థయాత్రలో భాగంగా దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు.

 Interesting Facts About Manasa Sarovaram, Pancha Sarovaralu, Hindu Believes, Man-TeluguStop.com

తీర్థయాత్రలో భాగంగా తీర్థం అంటే పుణ్యక్షేత్రం అనే ఒక అర్థాన్ని చెబుతారు.అయితే పూర్వ కాలంలో తీర్థం అంటే సరస్సు అని కూడా చెబుతారు.

అలా తీర్థాలకు అంటే క్షేత్రాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలు అని పిలుస్తారు.అయితే తీర్థయాత్రలలో ఒక భాగమే పంచ సరోవరాలు.

మన దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా వాటిలో ముఖ్యమైనవి పంపా సరోవరం, పుష్కర్ సరోవరం, నారాయణ సరోవరం, బిందుసరోవరం, మానస సరోవరం ఈ పంచ సరోవరాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి.వీటిలో మానస సరోవరం మరింత ప్రత్యేకత కలిగి ఉంది.

మన హిందూ పురాణాల ప్రకారం మానస సరోవరం బ్రహ్మదేవుని మనస్సు, ఆలోచన నుంచి ఏర్పడిందని దీనిని బ్రహ్మ సరోవరం అని కూడా పిలుస్తారు.సంస్కృతంలో మానస అనగా మనసు అని సరోవరం అంటే సరస్సు అని అర్థం .అన్ని సరోవరాలలో కెల్ల మానస సరోవరం ఎంతో పవిత్రమైనది.ఈ సరస్సులో నీటిని తాగడం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుందనీ, స్నానమాచరిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని మన హిందువులు విశ్వసిస్తుంటారు.

మానస సరోవరం ఎన్నో పవిత్ర నదులకు పుట్టినిల్లు గా భావిస్తారు.ఈ సరోవరం దగ్గర గంగను దివి నుంచి భువికి రప్పించడానికి భగీరథుడు ఘోరమైన తపస్సు చేశాడని మన పురాణాలు చెబుతున్నాయి.

ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతుల కోసం సృష్టించాడని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.జ్ఞానానికి, అందానికి ప్రతిరూపాలైన హంసలు ఈ మానససరోవరంలో విహరిస్తూ ఉంటాయి.బ్రహ్మదేవుడు మనసారా ఊహించి భూమిపై ఆవిష్కరించినది కనుక దీనిని మానససరోవరం గా చెబుతారు.పూర్వం మానస సరోవరం భారతదేశం, టిబేట్, నేపాల్ సరిహద్దుల తో కలిసి ఉండడం వల్ల హిందువులు, బౌద్ధులు, జైనులకు కు ఇది ఎంతో పవిత్రమైన సరస్సుగా భావిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube