ఎన్నో రహస్యాలకు నిలయమైన 'శృంగార బావి...మూడు అంతస్తులతో నిర్మితమై ..ఫిజిక్స్ కు కూడా అంతు పట్టని పరిజ్ణానంతో...     2018-10-07   11:12:58  IST  Sainath G

వరంగల్ అనగానే మనకు కాకతీయ మహారాజులు గుర్తుకు వస్తారు… కాకతీయులు అనగానే తక్షణం మనకు దేవాలయాలు, యుద్ధాలే గుర్తుకు వస్తాయి. కేవలం దేవాలయాలే కాకుండా శృంగార బావిని కూడా నిర్మించింది కాకతీయులే..శృంగారబావి కొలువు తీరింది వరంగల్ లోనే.. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమదేవితో పాటు ఆ వంశానికి చెందిన అనేకమంది ఈ శృంగార బావిలో స్నానం చేశారు.. అయితే రాణి రుద్రమ్మ ఇక్కడ స్నానం చేయడం వల్ల ఈ శృంగార బావికి చాలా ప్రాచూర్యం కలిగింది. అందువల్లే ఈ బావిని రాణి రుద్రమ్మ శృంగార బావి అని పిలుస్తారు. ఇది ఎన్నో రహస్యాలకు నిలయం..ఈ రహస్యాల ఛేదన కోసం ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి.అంతటి ప్రాముఖ్యత కలిగిన శృంగార బావి గురించి తెలుసుకుందామా…

Interesting Facts And Secrets Of Warangal Shrungara Bavi-

మూడు అంతస్తులు..

శృంగార బావి మూడు అంతస్తులతో నిర్మితమైనది. మూడు అంతస్తులతో కూడిన ఈ బావిలో పై అంతస్తులోకి ఎవరైనా అపరిచిత వ్యక్తి వస్తే కింది అంతస్తులో ఉన్నవారికి ఇట్టే తెలిసిపోతుంది. దీంతో వారిని తుద ముట్టించడానికి వీలవుతుందని ఆ విధంగా నిర్మించారు. ఇక మొదటి అంతస్తులో 9 స్తంభాలు, రెండో అంతస్తులో 4 స్తంభాలు, మూడో అంతస్తులో 2 స్తంభాలతో ఈ బావిని నిర్మించారు. ఈ బావి లోపలికి దిగితే టైం మిషన్ లో వెలుతున్నామా? అన్న భావన కలుగుతుంది. అంటే చరిత్ర పుటల్లోకి వెలుతున్న భావన కలుగుతుంది అన్నమాట. అనేక చారిత్రాత్మక విషయాలు గుర్తుకు వస్తాయి.అనేర రహస్యాలకు నిలయమైన ఈ బావి గురించి ఎంత చెప్పినా తక్కువే.

Interesting Facts And Secrets Of Warangal Shrungara Bavi-

సొరంగమార్గం…

శృంగార బావిలో ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఈ సొరంగ మార్గం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వెయ్యి స్తంభాల గుడికి తీసుకువెళుతుంది. ఆ వెయ్యి స్తంభాల గుడిలో మరో బావి కూడా ఉంది. ఈ బావిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఇందులోని నీళ్లను ఈశ్వరుడిని అభిషేకించడానికి వినియోగిస్తారు. ఇక శృంగార బావిలో స్నానం చేసి సొరంగ మార్గం గుండా ఆ వెయ్యి స్తంభాల గుడికి వెళ్లి అక్కడ స్వామివారికి పూజలు చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు.

ఫిజిక్స్ కి అంతు చిక్కని పరిజ్ణానం..

శృంగార బావిలో అంత:పుర స్త్రీలు స్నానం చేసే సమయంలో నీళ్లు ఎంత అలజడిగా ఉన్నా, ఎవరైనా చూస్తే వారి ప్రతి బింబం నీటిలో కనిపించేలా ఈ బావిని నిర్మించారు. దీంతో భౌతిక శాస్త్రానికి కూడా అంతుబట్టని పరిజ్జానాన్ని ఈ బావి నిర్మాణంలో వినియోగించినట్లు చెబుతారు. ఎంత వేసవిలోనైనా ఈ బావిలోని నీరు ఎండిపోదు. కరువు సమయాల్లో కూడా ఈ బావిలోని నీరు చల్లగా ఉండటం కూడా విశేషం.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.