శ్వేతా బసు ప్రసాద్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?  

interesting facts about young heroine swetha basu prasad, interesting facts, kottabangaru lokem, ride movie, swetha basu prasad, varun sandesh - Telugu Interesting Facts, Kottabangaru Lokam, Ride Movie, Swetha Basu Prasad, Varun Sandesh

సీరియల్స్ లో, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్వేతా బసు ప్రసాద్.కెరీర్ మొదట్లో హిందీ సినిమాల్లో నటించిన శ్వేతా బసు ప్రసాద్ కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

TeluguStop.com - Interesting Facts About Young Heroine Swetha Basu Prasad

తెలుగులో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న శ్వేతా బసు ప్రసాద్ ఆ తరువాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

కొత్త బంగారు లోకం సినిమాలో శ్వేతా బసు చెప్పిన ఏకడా డైలాగ్ బాగా పాపులర్ అయింది.

TeluguStop.com - శ్వేతా బసు ప్రసాద్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

శ్వేతా బసు ప్రసాద్ 1991వ సంవత్సరం జనవరి నెల 11వ తేదీన జమ్ షెడ్ పూర్ లో జన్మించారు.శ్వేతా తల్లి శర్మిష్ట బసు వెస్ట్ బెంగాల్ కు చెందిన వారు కాగా శ్వేతా తండ్రి అనుజ్ ప్రసాద్ బీహార్ కు చెందిన వారు.

మాస్ మీడియా, జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్వేతా బసు ప్రసాద్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కోసం కొన్ని కాలమ్స్ రాశారు.

Telugu Interesting Facts, Kottabangaru Lokam, Ride Movie, Swetha Basu Prasad, Varun Sandesh-Movie

2002 సంవత్సరంలో మక్డీ సినిమాతో బాలనటిగా శ్వేతా బసు కెరీర్ ను ప్రారంభించారు.ఆ సినిమాకు ఉత్తమ బాలనటిగా శ్వేతా బసుకు అవార్డ్ వచ్చింది.ఆ తరువాత ఇక్బాల్ అనే సినిమాలో నటించిన శ్వేత బసుకు ఆ సినిమాకు ఉత్తమ సహాయ నటి అవార్డ్ వచ్చింది.

శ్వేతా బసుకు శాస్త్రీయ సంగీతం అంటే ఎంతో ఇష్టం.శ్వేతా బసు సితార్ వాయించడంలో శిక్షణ కూడా పొందారు.

2014 సంవత్సరంలో శ్వేతా బసు ప్రసాద్ ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచారు.అయితే ఆ తరువాత కాలంలో కోర్టులో శ్వేతా బసు నిర్దోషి అని తీర్పు వెలువడింది.2018 సంవత్సరంలో శ్వేతా బసు ప్రసాద్ డైరెక్టర్ రోహిత్ మిట్టల్ ను వివాహం చేసుకున్నారు.అయితే ఆ తరువాత కాలంలోని కొన్ని కారణాల వల్ల శ్వేతా బసు తన భర్తతో విడిపోయారు.

#Varun Sandesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు