సాయిపల్లవి పేరులో సాయి ఎలా చేరిందంటే..?

నేడు యంగ్ హీరోయిన్ సాయిపల్లవి పుట్టినరోజనే సంగతి తెలిసిందే.తెలుగులో స్టార్ హీరోల సరసన పెద్దగా ఆఫర్లు రాకపోయినా సాయిపల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

 Interesting Facts About Young Heroine Saipallavi-TeluguStop.com

నటనతోనే కాదు డ్యాన్స్ తో సైతం మెప్పించగల ప్రతిభ సాయిపల్లవి సొంతం.నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి గ్లామర్స్ రోల్స్ కు దూరంగా ఉంటూ అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకున్నారు.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో సైతం సాయిపల్లవి నటిగా ఆఫర్లను అందిపుచ్చుకున్నారు.సాయిపల్లవి అమ్మ రాధ నాట్యకారిణి కాగా తండ్రి కన్నణ్ కస్టమ్స్ అధికారిగా పని చేసేవారు.

 Interesting Facts About Young Heroine Saipallavi-సాయిపల్లవి పేరులో సాయి ఎలా చేరిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిన్నప్పటి నుంచి సాయిపల్లవికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం.తొలిసారి తమిళంలో ధామ్ ధూమ్ అనే సినిమాలో సాయిపల్లవి నటించారు.ఆ సినిమా తరువాత మీరాజాస్మిన్ కు క్లాస్ మేట్ గా ఆమె నటించడం గమనార్హం.

ఆ తరువాత జార్జియాలో మెడిసిన్ చదివిన సాయిపల్లవి ఆ తరువాత మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలో నటించారు.

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తరువాత సాయిపల్లవి ఫిదా సినిమాలో నటించారు.సాయిపల్లవి తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయిని చేర్చింది.

సాయిపల్లవి అల్లు ర్జున్ డ్యాన్సులకు అభిమాని కాగా అల్లు అర్జున్ ఫిదాలో తన డ్యాన్స్ ను ప్రశంసించడం ఎప్పటికీ మరిచిపోలేనని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ, విరాటపర్వం సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

ఈ సినిమాలతో పాటు శ్యామ్ సింగరాయ్, మరికొన్ని సినిమాలలో సాయిపల్లవి నటిస్తున్నారు.ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాసినిమాకు సాయిపల్లవికి క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

సినిమా ఫ్లాప్ అయితే పలు సందర్భాల్లో సాయిపల్లవి తన రెమ్యునరేషన్ ను సైతం సాయిపల్లవి వెనక్కు ఇచ్చేశారు.

#Sai Name #Saipallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు