దేశంలోనే చాలా చిన్న సందు ఎక్కడ ఉందంటే..?!

మన ఊరిలోగాని పట్టణాల్లో గాని కొన్ని ఇరుకు సందులను మీరు చూసే ఉంటారు.అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇరుకు సందు చూస్తే మీరు ముక్కు మీద వేలు వేసుకోవడం ఖాయం.

 Interesting Facts About Worlds Narrowest Street In Germany Details, Small Street-TeluguStop.com

ఈ సందు ప్రపంచంలోనే అత్యంత ఇరుకు సందుగా పేరు గాంచింది.అంతేనా ఈ సందు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిపోయింది.

తాజాగా ఈ సందు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో పేరు సంపాదించుకుంది.నిజానికి దీనిని సందు అనడం కంటే ఒక వీధి అంటే బాగుంటుందేమో.

ఈ సందుకు ఇరువైపులా రెండు భవనాలు కూడా ఉన్నాయి.ఆ రెండు భవనాల మధ్య ఉన్న ఖాళీ స్థలమే ఈ సందు, ఒక వీధి కూడాను.2017 ఫిబ్రవరిలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారులు దీనిని పరిశీలించి, ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధిగా ప్రకటించారు.

ఇంతకీ ఈ సందు ఎక్కడ ఉంది.

ఏంటి అనే వివరాలు చూద్దామా.జర్మనీలో గల రియూల్టిన్‌జెన్‌ అనే పట్టణంలో ఈ ఇరుకు సందు ఉంది.

ఈ వీధి పేరు ‘స్ప్రోయూర్‌హోఫ్‌ స్ట్రాసే’. ఈ వీధికి రెండు శతాబ్దాల నాటి చరిత్ర ఉందట.అందుకే ఈ వీధిని ప్రపంచంలోనే అత్యంత ఇరుకైందిగా గిన్నిస్ బుక్ లో నమోదు చేసారు.1726లో నిర్మించిన ఈ వీధి వెడల్పు కేవలం 31 సెం.మీ అంటే కేవలం 1.1 అడుగు మాత్రమే.జర్మనీ భూభాగ లెక్కల ప్రకారం ఈ వీధికి రెండు వైపులా ఉన్న భవనాలు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి.

Telugu Germany, Guinness, Latest, Public Street, Riultenzen, Small Street, World

ఈ వీధిని 1820లో అధికారికంగా పబ్లిక్‌ స్ట్రీట్‌ 77గా ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుండి ఈ వీధిని చూసేందుకు పర్యాటకులు వచ్చేవారు.దానితో ఆ స్థలం పర్యాటక ప్లేస్ గా మారింది.చాలామంది దీని లోపలి నుంచి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.

కానీ ఇప్పుడు వీధికి ఎడమవైపు ఉన్న భవనం ఈ మధ్యనే శిథిలావస్థకు చేరింది.దానిని పడగొట్టి కొత్త భవంతిని నిర్మిస్తే ఈ వీథి ప్రాముఖ్యత కోల్పోతుందని భావించి ఇప్పటికి అలానే ఉంచారు.

అలాగే ఆ వీధి నుంచి ప్రయాణించేందుకు ప్రజలకు అనుమతి లేదు.ఎందుకంటే భవంతి ఎప్పుడు కూలిపోతుందో తెలియదు కాబట్టి వీధిలో నడిచేందుకు అనుమతి లేదు.

ప్రస్తుతానికి ఈ వీధి ప్రపంచంలో అత్యంత చిన్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube