రాజా మూవీని దాటుకుని ప్రభంజనం సృష్టించిన సినిమా ఏంటో తెలుసా?

వెంకటేష్, సౌందర్య హీరోహీరోయిన్లుగా ముప్పలనేని శివ డైరెక్షన్ లో తెరకెక్కిన “రాజా” సినిమా ఎంత పెద్ద హిట్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కోలీవుడ్ ఇండస్ట్రీలో హిట్టైన సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.1999 సంవత్సరం మార్చి 18వ తేదీన రాజా సినిమా రిలీజ్ కాగా ఈ సినిమాకు ముందు, తర్వాత రిలీజైన సినిమాలు రాజా సినిమాకు పెద్దగా పోటీని ఇవ్వలేకపోయాయి.

 Interesting Facts About Venkatesh Soundarya Raja Movie-TeluguStop.com

ఎస్.ఏ రాజ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమాకు తొలి వారమే ఏకంగా 2 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.2 కోట్ల రూపాయలు ఇప్పుడు తక్కువ మొత్తమే అయినా రాజా రిలీజైన సమయానికి ఆ మొత్తం చాలా ఎక్కువ.ఇటు క్లాస్ ప్రేక్షకులకు, అటు మాస్ ప్రేక్షకులకు రాజా సినిమా ఎంతగానో ఆకట్టుకుంది.రాజా సినిమాకు పోటీగా రేలంగి నరసింహారావు డైరెక్షన్ లో తెరకెక్కిన చిన్నిచిన్నిఆశ మూవీ విడుదలైంది.

Telugu China China Asha, Chinnichinniaasha, Devbi Movie, Devi, Harchadra Prasad, Hit Movies, Interesting Facts, Movie Collections, Prema, Raja, Soundarya, Vanita Vijay Kumar, Yama Jatakudu-Movie

అయితే రాజా సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు వస్తే చిన్నిచిన్నిఆశ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాకు వారం ముందు జేడీ చక్రవర్తి, రాశీ కాంబినేషన్ లో వచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్ విడుదలై ఫ్లాప్ గా విడుదల కాగా అదే రోజున విడుదలైన దేవి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.రాజా ప్రభంజనాన్ని తట్టుకుని భారీగా కలెక్షన్లను సాధించిన సినిమా దేవి మాత్రమే అని చెప్పాలి.

 Interesting Facts About Venkatesh Soundarya Raja Movie-రాజా మూవీని దాటుకుని ప్రభంజనం సృష్టించిన సినిమా ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu China China Asha, Chinnichinniaasha, Devbi Movie, Devi, Harchadra Prasad, Hit Movies, Interesting Facts, Movie Collections, Prema, Raja, Soundarya, Vanita Vijay Kumar, Yama Jatakudu-Movie

ప్రేమ, వనితా విజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.రాజా సినిమాకు రెండు వారాల ముందు మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన యమజాతకుడు సినిమా రిలీజ్ కాగా యమజాతకుడు యావరేజ్ గా నిలిచింది.

#Devbi #Devi #Prema #Yama Jatakudu #Raja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు