సంక్రాంతి సినిమాలో మొదట నటించనని చెప్పిన శ్రీకాంత్.. చివరకు?

Interesting Facts About Venkatesh Sankranthi Movie

ముప్పలనేని శివ డైరెక్షన్ లో తెరకెక్కి 2005 సంవత్సరంలో విడుదలైన సంక్రాంతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే.వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ అన్నాదమ్ములుగా నటించారు.

 Interesting Facts About Venkatesh Sankranthi Movie-TeluguStop.com

ప్రముఖ దర్శకుడు ముప్పలనేని శివ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.తన డైరెక్షన్ లో తెరకెక్కిన దోస్త్ అనే మూవీ ఫ్లాప్ అయిందని ఆ తర్వాత సంక్రాంతి సినిమాను తెరకెక్కించానని ముప్పలనేని శివ పేర్కొన్నారు.

సక్సెస్ లేని సమయంలో డిప్రెషన్ వస్తుందని అలా డిప్రెషన్ లో ఉన్న సమయంలో సంక్రాంతి సినిమా చేయాలని అనుకున్నానని ముప్పలనేని శివ తెలిపారు.పండుగ లాంటి కథ కావడంతో ఆ సినిమాకు సంక్రాంతి అనే టైటిల్ ను ఫిక్స్ చేశామని ఆయన అన్నారు.

 Interesting Facts About Venkatesh Sankranthi Movie-సంక్రాంతి సినిమాలో మొదట నటించనని చెప్పిన శ్రీకాంత్.. చివరకు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమ్మ పెట్టే భోజనమే సంక్రాంతి అని ఆ సినిమాకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే సక్సెస్ కు తొలిమెట్టు అని ముప్పలనేని శివ కామెంట్లు చేశారు.శ్రీకాంత్ మొదటసినిమాలో చేయనని అన్నాడని ఆ కథలో ఏముందని అన్నారని ముప్పలనేని శివ పేర్కొన్నారు.

చాలా మంచి సినిమా అని చెప్పగా రాధా గోపాళం సినిమాలో తాను, స్నేహ జంటగా నటిస్తున్నామని ఈ సినిమాలో వదిన వదిన అని పిలవాల్సి ఉంటుందని శ్రీకాంత్ తనతో చెప్పారని ముప్పలనేని శివ తెలిపారు.సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ శ్రీకాంత్ ను ఒప్పించిందని ముప్పలనేని శివ పేర్కొన్నారు.

ఆ తర్వాత ఏదైనా అనుకుంటే జరిగే వరకు మనశ్శాంతి ఉండదా అని శ్రీకాంత్ తనతో అన్నారని ముప్పలనేని శివ వెల్లడించారు.

Telugu Sankranthi, Srikanth, Venkatesh-Movie

తాను వడ్డే నవీన్ ను కూడా ఆ పాత్ర కోసం సంప్రదించాలని అనుకున్నానని ముప్పలనేని శివ పేర్కొన్నారు.తెర వెనుక జరిగే విషయాలను తాను బయటపెడుతున్నానని ముప్పలనేని శివ వెల్లడించారు.సంక్రాంతి సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర చిన్న పాత్ర అయినా ఆయన నటనతో ఆకట్టుకున్నారని ముప్పలనేని శివ వెల్లడించారు.

#Srikanth #Venkatesh #Sankranthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube