వెంకటేష్ కూతురు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

సాధారణంగా స్టార్ హీరోల కొడుకులు, కూతుళ్లు సినిమా రంగాన్ని ఎంచుకోవడానికే ఆసక్తి చూపిస్తారు.అయితే సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కూతురు అశ్రిత మాత్రం యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలలో భారీగా ఫాలోవర్లను కలిగి ఉండటంతో పాటు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్న వారిలో ఒకరిగా నిలిచారు.

 Interesting Facts About Venkatesh Daughter Ashritha,latest Tollywood News-TeluguStop.com

ఫుడ్ వ్లోగర్ గా స్థిరపడిన అశ్రిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

Telugu Ashritha, Blogger, Career, Instgram, Venkatesh, Youtube-Movie

ఆహారంపై తనకు ఉండే అభిరుచి వల్లే కొత్త కెరియర్ దిశగా అడుగులు వేశానని అయితే ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తానని తాను కూడా ఊహించలేదని ఆమె అన్నారు.ఇంటి వాతావరణం వల్లే ఆహారంపై తనకు ఇష్టం పెరిగి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.నాన్న, పెదనాన్న ఇతర దేశాలకు షూటింగ్ లకు వెళ్లిన సమయంలో అక్కడి వంటకాల విశేషాలను చెప్పేవారని తనకు ఆ సమయంలోని ఇతర ప్రాంతాల్లోకి వంటకాల రుచిని ఆస్వాదించాలని అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు.

నాన్న అమెరికాలో సొంతంగా వంట చేసుకునేవారని బయట ఆహారం నచ్చకపోవడంతో ఇంట్లోనే వండుకోవడం మొదలుపెట్టానని ఆమె అన్నారు.వంటలు, పర్యటనలకు సంబంధించిన విశేషాలను ఇతరులతో పంచుకోవాలని ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ఫినిటీ ఫ్లాటర్ ను మొదలుపెట్టానని ఆమె అన్నారు.

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ను వాడుకోవడం తనకు ఇష్టం లేదని అలా చేస్తే ఫ్యామిలీ వల్లే తనకు అన్నీ సులువుగా వచ్చాయని ప్రజలు అనుకుంటారని అశ్రిత చెప్పుకొచ్చారు.

Telugu Ashritha, Blogger, Career, Instgram, Venkatesh, Youtube-Movie

లక్ష్యాన్ని తెలుసుకుని శ్రమించి పని చేస్తే మాత్రమే ఆత్మసంతృప్తి దొరుకుతుందని అశ్రిత పేర్కొన్నారు.భర్త ప్రోత్సాహం తనకు ఉందని నాన్న తను చేసే పని విషయంలో గర్వపడుతున్నారని అశ్రిత అన్నారు.కర్ణాటకలోని కూర్గ్ తనకు ఇష్టమైన ప్రాంతమని బార్సిలోనాలో తాను స్థిరపడ్డానని ఆమె అన్నారు.

ఎకనామిక్స్ లో మాస్టర్స్ చదివి ఆ తర్వాత ఎంబీఏ చేశానని అశ్రిత చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube