ఆ పాట వల్లే మనసంతా నువ్వే హిట్టైందా.. ప్రేక్షకులకు తెలియని విషయాలివే?

ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో మనసంతా నువ్వే ఒకటనే సంగతి తెలిసిందే.ప్రేమకథలలో ఒకటైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 Interesting Facts About Uday Kiran Manasantha Nuvve Movie, Manasantha Nuvve Movi-TeluguStop.com

ఉదయ్ కిరణ్ స్టార్ స్టేటస్ అందుకోవడానికి కారణమైన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు.ఈ సినిమా రిలీజై 20 సంవత్సరాలైనా ఇప్పటికీ టీవీలో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటోంది.

దేవీపుత్రుడు సినిమా తర్వాత ఎం.ఎస్.రాజు కొత్త దర్శకుడు వీ.ఎన్.ఆదిత్యకు మనసంతా నువ్వే సినిమాకు అవకాశం ఇచ్చారు.సుమంత్ ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లిన వీ.ఎన్ ఆదిత్య మనసంతా నువ్వే కథను వినిపించగా ఆ కథ నచ్చడంతో సినిమాను నిర్మించడానికి ఎం.ఎస్ రాజు సిద్ధమయ్యారు.అయితే పరుచూరి బ్రదర్స్ కు మాత్రం మనసంతా నువ్వే కథ నచ్చలేదు.

Telugu Udaykiran, Manasanta Nuvve, Nee Sneham, Reema Sen, Tuniga Tuniga, Uday Ki

ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు మళ్లీ జరిగాయి.ఆ తర్వాత పదిరోజుల్లో సినిమా సెట్స్ పైకి వెళ్లగా కేవలం 4 నెలల్లో సినిమా షూటింగ్ పూర్తైంది.అయితే షూటింగ్ పూర్తైన తర్వాత క్లైమాక్స్ అనుకున్న స్థాయిలో లేదని యూనిట్ సభ్యులు నిరాశ పడ్డారు.

ఆ తర్వాత ఎడిటర్ కె.వి.కృష్ణారెడ్డి క్లైమాక్స్ లో నీ స్నేహం పాటను పెట్టగా అందరూ బాగుందని చెప్పారు.ఈ పాటను క్లైమాక్స్ లో పెట్టడం వల్లే సినిమా హిట్టైందని యూనిట్ సభ్యులు భావించారు.

తక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.ఈ సినిమాలో సూపర్ హిట్టైన తూనీగ తూనిగ మలయాళంలోని ప్రణయమవంగళ్ సినిమాలోని పాట నుంచి తీసుకున్న గీతం కావడం గమనార్హం.

మిగిలిన పాటలను ఆర్పీ పట్నాయక్ స్వరపరచగా పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube