వెంకటేష్ కొడుకు కూతుర్ల గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.? ఎవరు ఏం చేస్తున్నారు అంటే?     2018-09-23   05:38:06  IST  Sainath G

మనం అభిమానించే హీరో గురించి, వారి ఫ్యామిలీ ఎవరు ఏంటి అని ఇలా ప్రతి ఒక్కటీ తెలుసుకుంటాం. మన టాలీవుడ్ లో టాప్ హీరోలుగా అలరిస్తున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఈ స్టార్ హీరోలు డైలీ లైఫ్, వారి ఫ్యామిలీ, పిల్లలు ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే వారితో పాటు టాప్ స్టార్ హీరోగా అలరిస్తున్న విక్టరీ వెంకటేష్ గురించి తప్ప, వెంకటేష్ భార్య? వెంకీ పిల్లలు ఎవరు? వారు ఏం చేస్తున్నారు? లాంటి విషయాలు ఎవ్వరికీ తెలీవు. వెంకటేష్ తన భార్యను, తన పిల్లలను ఎప్పుడూ సినిమా ఫంక్షన్ లకు గానీ? బయటజరిగే ప్రోగ్రామ్స్ కు గానీ తన ఫ్యామిలీని తీసుకురాడు? వెంకటేష్ కొడుకు అర్జున్ తప్ప, వెంకటేష్ పిల్లలెవరూ ఏ కార్యక్రమంలోనూ మనకు కనిపించరు?

ఇప్పుడు మీడియాలో వెంకటేష్ కూతురు లవ్ మ్యారేజ్ న్యూస్ ఫుల్ గా వైరల్ అవుతుంది. ఆ వార్తలను రెండు కుటుంబాల వారు కొట్టి పారేశారు. మళ్లీ ఇన్నాళ్లకు అశ్రిత వివాహం గురించి మీడియాలో వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ చైర్మన్‌ ఆర్‌ సురేందర్‌ రెడ్డి మనవడితో గత కొంత కాలంగా అశ్రిత ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. ఇటీవలే వీరి ప్రేమ వ్యవహారం బయటకు తెలిసింది. ప్రేమ విషయం తెలిసిన వెంటనే సురేష్‌బాబు స్వయంగా వెళ్లి సురేందర్‌ రెడ్డి ఫ్యామిలీతో మాట్లాడినట్లుగా సమాచారం అందుతుంది.

ఈ విషయం గురించి పక్కన పెడితే…వెంకటేష్ పిల్లల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను మనం తెలుసుకుందాం.

1. వెంకటేష్ భార్య పేరు నీరజా. వీరి వివాహం 1985 లో జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి.

2. ఆశ్రిత, హయవాహిని,భావన లు అమ్మాయిలు. అబ్బాయిపేరు అర్జున్. వీరిలో పెద్ద కూతురు ఆశ్రిత బిజినెస్ లో ఆసక్తి చూపిస్తుంది. వ్యాపార రంగం లో అద్భుతాలు చెయ్యాలి అనుకుంటున్నట్లు ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

3. ఇక రెండవ కూతురు హయవాహిని ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆయా రంగంలో ద్రుష్టి పెట్టింది. ఇప్పటికే హయవాహిని డిజైన్ చేసిన దుస్తులకు సూపర్ రెస్పాన్స్ వచ్చి హిట్ అయ్యాయి.

4. వెంకీ చిన్న కూతురు భావన త్వరలోనే సినిమారంగంలోకి రావాలని ఆసక్తి కనబరుస్తుందట.. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న భావన మంచి కథ దొరికితే సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

5. కొడుకు అర్జున్ మాత్రం సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై త్వరలోనే వెంకటేష్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.