హీరో రవితేజ అసలు పేరు ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ఈ ఏడాది క్రాక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్న రవితేజ పుట్టినరోజు నేడు.1968 సంవత్సరం జనవరి 26వ తేదీన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రవితేజ జన్మించారు.ముగ్గురు కొడుకుల్లో రవితేజ పెద్ద కొడుకు కాగా అయన తండ్రి ఫార్మసిస్ట్ గా పని చేసేవారు.

 Interesting Facts About Tollywood Star Hero Raviteja, Raviteja Career, Movies, T-TeluguStop.com

రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు కాగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో రవితేజ కొన్ని సినిమాలకు సహాయదర్శకునిగా పని చేశారు.

బాల్యం నుంచే రవితేజకు సినిమాలంటే ఆసక్తి కాగా నాన్న ఇచ్చిన పాకెట్ మనీతో రవితేజ సినిమాలను చూసేవారు.

సినిమాలు చూడటం కొరకు రవితేజ కొన్నిసందర్భాల్లో అమ్మ హ్యాండ్ బ్యాగులో చిల్లరను ఆమెకు తెలియకుండా తీసుకునేవారట.రవితేజ కెరీర్ మొదట్లో చిన్నచిన్న పాత్రల్లో నటించగా ఆ పాత్రలే అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

చిన్నప్పుడే హీరో అవ్వాలని అనుకున్న రవితేజ ఆ దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు.

Telugu Assistant, Khiladi, Krack, Krishna Vamshi, Raviteja, Raviteja Career, Tol

కృష్ణవంశీ దగ్గర నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రవితేజ ఆ సినిమా సింధూరంలో మంచి పాత్రలో నటించారు.శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన నీకోసం సినిమా ద్వారా హీరోగా మారిన రవితేజ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల ద్వారా హీరోగా నిలదొక్కుకున్నారు.రవితేజకు ఒక పాప, ఒక బాబు.

రవితేజ పాప పేరు మోక్షిత కాగా బాబు పేరు మహాధన్.

రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాలో నటిస్తుండగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

రవితేజ బలుపు, పవర్, రాజా ది గ్రేట్ సినిమాల్లో పాటలు పాడి సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.రవితేజ నటించిన నీకోసం, ఖడ్గం సినిమాలకు ఆయనకు స్పెషల్ జ్యూరీ అవార్డులు లభించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube