స్టార్ హీరో ప్రభాస్ హీరో కాకపోతే ఏమయ్యేవారో మీకు తెలుసా?

Interesting Facts About Tollywood Star Hero Prabhas

స్టార్ హీరో ప్రభాస్ కు ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.అక్టోబర్ 23వ తేదీ పాన్ ఇండియా హీరో ప్రభాస్ పుట్టినరోజు కాగా నిన్న ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రావడంతో ఫ్యాన్స్ తెగ సంతోషించారు.

 Interesting Facts About Tollywood Star Hero Prabhas-TeluguStop.com

ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నెలల నుంచి ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ టీజర్ రిలీజైంది.ప్రభాస్ రాధేశ్యామ్ లో విక్రమాదిత్య పాత్రలో జ్యోతిష్కుడిగా కనిపించబోతున్నారని టీజర్ ద్వారా వెల్లడైంది.

రాధేశ్యామ్ టీజర్ వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు.ఇప్పటివరకు ఏ టీజర్ కు అందని స్థాయిలో ఈ టీజర్ రికార్డులను సొంతం చేసుకుంటోంది.ప్రభాస్ ఫ్రెండ్స్ తో పాటు సన్నిహితులకు ఎంతో విలువ ఇస్తారు.ప్రభాస్ ఆతిథ్యం సైతం మరిచిపోలేని స్థాయిలో ఉంటుందనిఆయన ఆతిథ్యాన్ని పొందిన వాళ్లు అభిప్రాయపడుతూ ఉంటారు.

 Interesting Facts About Tollywood Star Hero Prabhas-స్టార్ హీరో ప్రభాస్ హీరో కాకపోతే ఏమయ్యేవారో మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కనీసం 15 నుంచి 20 రకాలు లేనిదే ప్రభాస్ ఇంట్లో భోజనం వడ్డించరు.

బాహుబలి కోసం ప్రభాస్ ఐదు సంవత్సరాల డేట్లు కేటాయించడం గమనార్హం.

అయితే ప్రభాస్ హీరో కాకపోతే మాత్రం రెస్టారెంట్ బిజినెస్ ను పెట్టుకోవాలని భావించారు.ప్రభాస్ కు ఏకంగా 15 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు.

స్నేహితులు ప్రేమగా తినిపించే ముద్దలు తినడం ప్రభాస్ కు ఎంతో ఇష్టం.ప్రభాస్ మాట్లాడే మాటలలో సినిమా గురించే ఎక్కువ మాటలు ఉంటాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Telugu Best Friends, Interesting Facts, Prabhas, Tollywood Hero-Movie

పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురైతే మాత్రం సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నను దాటవేయడానికి ప్రభాస్ ఆసక్తి చూపుతారు.కొత్తదనాన్ని బాగా ఇష్టపడే హీరోగా ప్రభాస్ కు పేరుంది.వాలీబాల్ ను ఎంతో ఇష్టపడే ప్రభాస్ ఇంట్లో వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది.ప్రభాస్ సన్నిహితులు కూడా ప్రభాస్ పెళ్లి గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.ప్రభాస్ పెళ్లి చేసుకుంటారో లేక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మిగులుతారో చూడాల్సి ఉంది.

#Prabhas #Friends

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube