విజయనిర్మల లైఫ్ లో నిజమైన రాజబాబు మాటలు.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, దర్శకురాలిగా గుర్తింపును సొంతం చేసుకున్న విజయనిర్మల పాండురంగ మహత్యం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాలో విజయనిర్మల బాలనటిగా నటించారు.

 Interesting Facts About Tollywood Film Actress Vijayanirmala-TeluguStop.com

ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ విజయనిర్మల హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.ఒకవైపు సినిమాల్లో హీరోయిన్ గా, ఇతర పాత్రల్లో నటిస్తూనే పలు సినిమాలకు విజయనిర్మల దర్శకత్వం వహించారు.

2002 సంవత్సరంలో ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయనిర్మల గిన్నీస్ బుక్ లో ఎక్కారు.50కు పైగా సినిమాలలో కృష్ణ, విజయనిర్మల కలిసి నటించడం గమనార్హం.వెండితెరపై కృష్ణ, విజయనిర్మల మంచి జోడీ అనిపించుకోవడంతో పాటు రియల్ లైఫ్ లో కూడా వీళ్లిద్దరూ అన్యోన్య దంపతులుగా పేరును సొంతం చేసుకోవడం గమనార్హం.విజయనిర్మల డేరింగ్ హీరోయిన్ గా పేరును సొంతం చేసుకున్నారు.

 Interesting Facts About Tollywood Film Actress Vijayanirmala-విజయనిర్మల లైఫ్ లో నిజమైన రాజబాబు మాటలు.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Comedian Rajababu, Film Actress, Interesting Facts, Krishna, Krishna Vijayanirmala, Mariage, Rajababu, Sakshi Movie, Tollywood, Vijayanirmala, Vijayanirmala Life-Movie

కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన తొలి సినిమా సాక్షి కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కృష్ణ, విజయనిర్మల దంపతులు అవుతారని ప్రముఖ హాస్యనటులలో ఒకరైన రాజబాబు ఊహించి కామెంట్లు చేశారు.తర్వాత రోజుల్లో రాజబాబు మాటలు నిజం కావడం గమనార్హం.గోదావరి గట్టున సాక్షి సినిమా షూటింగ్ జరగగా సినిమాలో ఒక సన్నివేశంలో కృష్ణ, విజయనిర్మల పెళ్లి చేసుకుంటారు.

Telugu Comedian Rajababu, Film Actress, Interesting Facts, Krishna, Krishna Vijayanirmala, Mariage, Rajababu, Sakshi Movie, Tollywood, Vijayanirmala, Vijayanirmala Life-Movie

ఆ సమయంలో రాజబాబు ఈ గుడికి చాలా మహిమ ఉందని గుడిలో జరిగిన ఘటనలు రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయని వెల్లడించారు.రాజబాబు అలా కామెంట్ చేసిన రెండు సంవత్సరాల తర్వాత కృష్ణ, విజయనిర్మల వివాహం జరిగింది.స్త్రీలకు సంబంధించిన కథాంశాలను విజయనిర్మల ఎక్కువగా తెరకెక్కించడం గమనార్హం.

ఆ తర్వాత కాలంలో విజయనిర్మల తనపై ఈ ఇమేజ్ పడకూడదని భావించి కొన్ని కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.

#Vijayanirmala #Krishna #Actress #Rajababu #Sakshi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు