ఈ రైల్వే స్టేషన్ లో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి బాలయ్యలకు సక్సెస్ దక్కడంతో?

సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి.కొన్ని ప్రాంతాలలో సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అని ఇండస్ట్రీ వాళ్లు నమ్ముతారు.

 Interesting Facts About Timmapur Railway Station Balayya Chiru Movie Shootings D-TeluguStop.com

తెలంగాణలోని తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ లో ఏదైనా సినిమాను షూట్ చేస్తే ఆ సినిమా కచ్చితంగా హిట్ అని చాలామంది భావిస్తారు.స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు చాలామంది హీరోల సినిమాలు ఇక్కడ్ షూటింగ్ జరుపుకోవడం గమనార్హం.

తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ లో ఒక సీన్ ను షూట్ చేసినా సినిమా సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉండటంతో ఈ రైల్వే స్టేషన్ కు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఏర్పడింది.బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో సమరసింహారెడ్డి ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలోని ట్రైన్ సన్నివేశాలను ఇక్కడే షూట్ చేశారని సమాచారం అందుతోంది.చిరంజీవి హీరోగా తెరకెక్కిన అల్లుడా మజాకా షూటింగ్ కూడా ఈ రైల్వే స్టేషన్ లోనే జరిగింది.

వెంకటేష్ హీరోగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సూర్యవంశం సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఈ రైల్వే స్టేషన్ లోనే షూట్ చేశారని సమాచారం అందుతోంది.

Telugu Alluda Majaka, Balakrishna, Chiranjeevi, Railway, Samarasimha, Suryavamsa

తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ లో తెలుగు సినిమాలను షూట్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు సైతం ఉన్నాయి.ఈ రైల్వే స్టేషన్ చిన్న రైల్వే స్టేషన్ అయినా ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఈ స్టేషన్ లో అందుబాటులో ఉన్నాయి.

Telugu Alluda Majaka, Balakrishna, Chiranjeevi, Railway, Samarasimha, Suryavamsa

ఈ రైల్వే స్టేషన్ ద్వారా ప్రతిరోజూ 100 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని సమాచారం.ఈ రైల్వే స్టేషన్ లో ఒకరోజులో కేవలం 4 రైళ్లు మాత్రమే ఆగుతాయి.ఈ రైల్వే స్టేషన్ కు పలు అవార్డులు సైతం రావడం గమనార్హం.

ప్రస్తుతం రైల్వే స్టేషన్ లో పాత భవనాలను తొలగించి కొత్తవాటిని నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube