ఆలయ గోపురం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..!

మన పురాణాల ప్రకారం భగవంతుడు సాక్షాత్తు కొలువై ఉన్న ప్రదేశాన్ని ఆలయం అని చెబుతాము.ఆలయం అనగానే మనకు ఆలయ గోపురం, ధ్వజస్తంభం, ఆలయ గోపురం పై నిర్మించబడిన ఉన్న శిల్పాలు, ఆలయం శిఖర భాగాన కలశం ఇవే మన కంటికి కనబడతాయి.

 Interesting Facts About The Temple Dome Temple Dome, Flagpole, Temples, Wind Tow-TeluguStop.com

ఈ విధంగా ఆలయంలోని ప్రతి భాగంలోనూ అనేక విషయాలు మనకు కనబడతాయి.ఆలయంలోని ప్రతి భాగానికి కూడా కొందరు ఆది దేవతలు ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ ఆలయంలో ఎంతో ముఖ్యమైన ఆలయ గోపురం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఆలయం అనగానే ముందుగా మన కళ్ళలో కనిపించేది గాలిగోపురం ఆలయ గోపురాన్ని చాలా ఎత్తులో నిర్మించి గోపురం పై అనేక శిల్పాలు చెక్కబడి ఉంటాయి.

గుడికి వెళ్లాలనే భక్తులు ముందుగా ఈ గోపురాన్ని చూడగానే వారిలో ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది.మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ గోపురాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవచ్చు.

ఆలయానికి తొలి వాకిలిగా గాలి గోపురాన్ని సూచిస్తారు.దీనినే ద్వారాశాల అని కూడా పిలుస్తారు.

మరి కొందరు ఈ ఆలయ ద్వారాన్ని గాలిగోపురం అని కూడా పిలుస్తారు.

నిజానికి ఆలయ ద్వారం ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి పాదాలను సూచిస్తుంది.అందుకే ఈ ఆలయ గోపురాన్ని కాలి గోపురం అని పిలిచేవారు.క్రమక్రమంగా ఈ కాలి గోపురం కాస్తా, గాలి గోపురంగా మారిపోయింది.

ఈ గోపురం పై చెక్కబడిన శిల్పాలు ఆలయ చరిత్రను మనకు తెలియజేస్తాయి.మనం ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంత దూరంలోనే మనకు ఈ ఆలయ గోపురాలు కనిపిస్తాయి.

ఈ విధంగా ఆలయ గోపురం కనిపించగానే చాలామంది గోపురానికి నమస్కరిస్తూ ఉంటారు.ఈ విధంగా గోపురానికి నమస్కరించడం వల్ల సాక్షాత్తూ ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారి పాదాలకు నమస్కరించిన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఆలయ గోపురం ఒక నిర్మాణం మాత్రమే కాదు పౌరాణిక విజ్ఞానాన్ని తెలియజేసే ఒక పాఠశాల అని కూడా చెప్పవచ్చు.

Interesting Facts about Temple Dome #TeluguFacts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube