విజయ్ సేతుపతి గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?

ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ భాషల్లోని సినిమాల విషయంలో విజయ్ సేతుపతి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఒకవైపు హీరోగా నటిస్తున్న విజయ్ సేతుపతి మరోవైపు విలన్ పాత్రల్లో కూడా నటించి మెప్పిస్తూ ఉండటం గమనార్హం.ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించి మెప్పించడం విజయ్ సేతుపతి ప్రత్యేకత.96 సినిమాలో సున్నిత ప్రేమికుడిగా నటించి మెప్పించిన విజయ్ సేతుపతి మాస్టర్ సినిమాలో మాత్రం భయంకరమైన విలన్ గా నటించారు.

 Interesting Facts About Tamil Actor Vijay Setupati,tolyywood,kollywood.master Mo-TeluguStop.com

సినిమాసినిమాకు సక్సెస్ రేటుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా విజయ్ సేతుపతి పెంచుకుంటూ ఉండటం గమనార్హం.మలయాళ, హిందీ భాషల్లో కూడా విజయ్ సేతుపతికి ఆఫర్లు వస్తుండగా తనకు నచ్చిన పాత్రలకు మాత్రమే విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండటం గమనార్హం.

ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో నటిస్తూ నటనతో అభిమానులను సొంతం చేసుకుంటున్న విజయ్ సొంతూరు తమిళనాడులోని రాజ పాల్యెం.

కామర్స్ లో డిగ్రీ చదివిన విజయ్ ఆ తరువాత సేల్స్ మ్యాన్ గా, క్యాషియర్ గా చిన్నచిన్న ఉద్యోగాలు చేశారు.16 సంవత్సరాల వయస్సులో సినిమా అడిషన్ లో పాల్గొని అవకాశం రాకపోవడంతో సినిమా ఆలోచనలకు దూరమయ్యారు.పాకెట్ మనీ కొరకు చిన్న ఉద్యోగాలు చేసిన విజయ్ దుబాయ్ కు వెళ్లి మూడు సంవత్సరాలు ఒక కంపెనీలో పని చేశాడు.2003లో దుబాయ్ నుంచి భారత్ కు వచ్చిన విజయ్ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థను స్థాపించడం, ఒక మార్కెట్ సంస్థలో ఉద్యోగం చేసినా అతనికి పనిలో సంతృప్తి దొరకలేదు.

Telugu Master, Tamil, Vijay Setupati, Villain-Movie

ఒక నాటక సంస్థలో అకౌంటెంట్ గా చేరిన విజయ్ అక్కడ నటనలో మెలుకువలు నేర్చుకుని తనను తాను మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు.మొదట్లో చిన్నాచితకా పాత్రలు చేసిన విజయ్ ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు.విజయ్ సేతుపతి భార్య పేరు జెస్సీ కాగా ఈ జంటకు సూర్య అనే కొడుకు, ఒక పాప ఉన్నారు.

సినిమా పాటలు రాయడం, పాడటం విజయ్ సేతుపతి హాబీలు కాగా విజయ్ వంట కూడా బాగా చేస్తారు.ఇతర వంటకాలతో పోలిస్తే విజయ్ బిర్యానీని అద్భుతంగా చేస్తారని తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube