రోబోలను తెరపై చూపించిన సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఏదో మీకు తెలుసా?

దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ప్రజాదరణను కలిగి ఉన్న హీరోలలో ఒకరిగా సూపర్ స్టార్ కృష్ణ కొనసాగారు.గత కొన్నేళ్ల నుంచి కృష్ణ సినిమాలకు దూరంగా ఉన్నారు.

 Interesting Facts About  Super Star Krishna Dongalu Baboy Dongalu Movie, Interes-TeluguStop.com

అయితే సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు మాత్రం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.సినీ కెరీర్ లో 340 సినిమాలకు పైగా కృష్ణ నటించారు.

ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను అందుకున్నాయి.

కృష్ణ నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా సత్తా చాటారు.

డైరెక్టర్ గా కృష్ణ ఏకంగా 16 సినిమాలను తెరకెక్కించడం గమనార్హం.తన సినిమాల ద్వారా కృష్ణ కొత్త టెక్నాలజీలతో పాటు కొత్త జానర్ లను పరిచయం చేశారు.అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణకు రికార్డు స్థాయిలో అభిమాన సంఘాలు ఉండేవి.2010 సంవత్సరంలో నటనకు, రాజకీయాలకు దూరంగా ఉండాలని కృష్ణ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Telugu Dongalubaboy, Robotic, Krishna, Radha, Robots, Tollywood-Movie

తెలుగు తెరపై రోబోలను చూపించిన సినిమా కృష్ణ మూవీ కావడం గమనార్హం.కృష్ణ నటించిన దొంగలు బాబోయ్ దొంగలు అనే సినిమాలో తెలుగు తెరపై రోబోలు కనిపించాయి.త్రిమూర్తి ప్రొడక్షన్స్ అనే సంస్థ ఈ సినిమాను నిర్మించింది.దొంగ టైటిల్స్ తో ఈ బ్యానర్ పై ఎక్కువ సినిమాలు తెరకెక్కడం గమనార్హం.హీరో కృష్ణ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Telugu Dongalubaboy, Robotic, Krishna, Radha, Robots, Tollywood-Movie

ఈ సినిమాలో కృష్ణ, రాధ 12 రోబోలతో తెరకెక్కిన సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.1984 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది.ఈ సినిమాకు ముందు దొంగలకు సవాల్ అనే సినిమాలో కూడా రోబోలను చూపించినా క్రియాశీలకంగా ఉపయోగించింది మాత్రం దొంగలు బాబోయ్ దొంగలు మూవీ కావడంతో ఈ సినిమానే ఫస్ట్ రోబోటిక్ మూవీగా అభిమానులు భావిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube