ఒకవైపు ఏడుపు వస్తుంటే నవ్వుతూ పాట పాడిన చిత్ర.. ఏం జరిగిందంటే..?

తెలుగుతో పాటు ఇతర భాషల్లో 20,000కు పైగా పాటలు పాడి సింగర్ చిత్ర తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.మలయాళంలో సింగర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన చిత్ర తర్వాత కాలంలో ఇతర భారతీయ భాషల్లో కూడా పాటలు పాడారు.

 Interesting Facts About Star Singer Chitra-TeluguStop.com

చిత్ర తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కాగా చిత్రకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు.చిన్నప్పుడు టీచర్ కావాలని అనుకున్న చిత్ర గాయనిగా కెరీర్ ను మొదలుపెట్టి వరుసగా అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

అమ్మ కూడా పాటలు బాగా పాడతారని అయితే అమ్మ కేవలం ఇంట్లో మాత్రమే పాటలు పాడతారని చిత్ర చెప్పుకొచ్చారు.తనది అరేంజ్డ్ మ్యారేజ్ అని తన భర్త ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పని చేసేవారని చిత్ర వెల్లడించారు.

 Interesting Facts About Star Singer Chitra-ఒకవైపు ఏడుపు వస్తుంటే నవ్వుతూ పాట పాడిన చిత్ర.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలు గారు, జేసుదాసు గారి వల్లే తాను ప్రస్తుతం ఇంత గొప్ప స్థానంలో ఉన్నానని చిత్ర తెలిపారు.నానురు సింధు పాట కొరకు తనను పిలిచారని ఆ పాటకు తనకు జాతీయ అవార్డ్ కూడా వచ్చిందని చిత్ర చెప్పుకొచ్చారు.

తెలుగులో తాను పాటను తప్పుగా పాడగా ఎస్పీ బాలూ సరి చేశారని చిత్ర చెప్పారు.ఇళయరాజా గారు పాట రికార్డింగ్ జరిగే రోజునే ఏ సింగర్ ఆ పాట పాడాలో నిర్ణయం తీసుకుంటారని చిత్ర వెల్లడించారు.ఒకరోజు తాను రికార్డింగ్ కు ఆలస్యంగా వెళ్లానని ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యం తన కొరకు వేచి చూస్తున్నారని ఇలా చేయడం బాగుందా అని అడగడంతో తనకు కన్నీళ్లు వచ్చి ఏడ్చేశానని చిత్ర పేర్కొన్నారు.

ఒకవైపు ఏడుపు వస్తుంటే మరోవైపు నవ్వుతూ ఆ పాటను పాడాల్సి వచ్చిందని చిత్ర అన్నారు.తాను అంతకుముందు కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదని ఇళయరాజా చెప్పారని చిత్ర అన్నారు.తనకు సుశీల, జానకి పాడిన పాటలు అంటే ఎంతో ఇష్టమని చిత్ర చెప్పుకొచ్చారు.

#Ilayaraja #Janaki #Chitra #Jasu Dasu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు