సినిమా హీరోయిన్ల గౌరవాన్ని పెంచిన సౌందర్య.. ఆమె గురించి ఎవరికీ తెలియని విషయాలివే?

Interesting Facts About Star Heroine Soundarya

టాలీవుడ్ హీరోయిన్లలో కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ గా సౌందర్యకు పేరుంది.గ్లామరస్ రోల్స్ చేస్తే మాత్రమే ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు సొంతమవుతుందని ఇప్పటికీ భావించే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు.

 Interesting Facts About Star Heroine Soundarya-TeluguStop.com

అయితే సౌందర్య మాత్రం కేవలం అభినయంతోనే సినిమా ఇండస్ట్రీలో రాణించడం గమనార్హం.తక్కువ సమయంలోనే తన టాలెంట్ తో సౌందర్య స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నారు.

కన్నడ నటి అయినప్పటికీ తన నటనతో సౌందర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన సౌందర్య రైతు భారతం సినిమాతో తెలుగులో కెరీర్ ను మొదలుపెట్టారు.

 Interesting Facts About Star Heroine Soundarya-సినిమా హీరోయిన్ల గౌరవాన్ని పెంచిన సౌందర్య.. ఆమె గురించి ఎవరికీ తెలియని విషయాలివే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తెలుగులో రిలీజైన సౌందర్య తొలి సినిమా మనవరాలి పెళ్లి కావడం గమనార్హం.రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, టాప్ హీరో, పెళ్లి పీటలు, ప్రేమకు వేళాయరా, మరికొన్ని సినిమాలలో సౌందర్య నటించారు.

యమలీల సినిమాలో ఛాన్స్ వచ్చినా కొన్ని రీజన్స్ వల్ల సౌందర్య ఆ ఛాన్స్ ను వదులుకున్నారు.

Telugu Soundarya, Balayya, Chiranjeevi, Cine Career, Producers, Raitu Bharatham, Respect, Tollywood-Movie

ఆమె తండ్రి సత్యనారాయణ జాతకం ప్రకారం ఆమె పేరును తర్వాత రోజుల్లో సౌందర్యగా మార్చారు.ఆమె జాతకం ప్రకారం 2004 సంవత్సరంలో కెరీర్ ఎండ్ అవుతుందని ఆమె తండ్రి చెప్పారు.ఆమె తండ్రి చెప్పిన విధంగానే జరగడం గమనార్హం.

అయితే ఆమె జీవితం ముగుస్తుందని ఎవరూ భావించలేదు.

Telugu Soundarya, Balayya, Chiranjeevi, Cine Career, Producers, Raitu Bharatham, Respect, Tollywood-Movie

చిరంజీవికి జోడీగా రిక్షావోడు, అన్నయ్య, చూడాలని ఉంది సినిమాలలో సౌందర్య నటించారు.బాలయ్యకు జోడీగా టాప్ హీరో సినిమాలో సౌందర్య నటించారు.వెంకీ, నాగార్జునలతో సౌందర్య ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించారు.

కామెడీ టచ్ ఉన్న పాత్రల్లో కొన్ని సినిమాల్లో సౌందర్య నటించడం గమనార్హం.నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా సౌందర్య కెరీర్ ను కొనసాగించారు.

హీరోయిన్ల గౌరవాన్ని పెంచే విధంగా సౌందర్య వ్యవహరించారు.సౌందర్య నటించి విడుదలైన చివరి సినిమా శివ్ శంకర్ కావడం గమనార్హం.

#Cine Career #Raitu Bharatham #Balayya #Soundarya #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube