స్టార్ హీరోయిన్ శ్రియ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?

ఇష్టం మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రియ తన సినిమాలతో రెండు దశాబ్దాలుగా అభిమానులలో క్రేజ్ ను పెంచుకోవడంతో పాటు విజయాలను అందుకుంటున్నారు.పలు సినిమాలలో శ్రియ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.

 Interesting Facts  About Star Heroine Shriya Saran Saree Details, Actress Shriya-TeluguStop.com

సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సత్తా చాటుతున్న హీరోయిన్లలో శ్రియ ఒకరని చెప్పవచ్చు.ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రియ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.

బ్రాండెడ్ దుస్తులను ధరించడానికి శ్రియ ఎక్కువగా ఇష్టపడతారు.తను ధరించే దుస్తుల గురించి శ్రియ మాట్లాడుతూ ఖరీదైన దుస్తులు, ఆభరణాలు ధరించడం వల్ల అందం పెరుగుతుందని అన్నారు.

అయితే నిజమైన అందం అంటే మాత్రం ఆరోగ్యమే అని శ్రియ పేర్కొన్నారు.సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని పాటించడం ద్వారా అందంగా కనిపించడం సాధ్యమవుతుందని శ్రియ పేర్కొన్నారు.

శ్రియ ధరించిన ఈ చీర ఖరీదు 44,000 రూపాయలు కావడం గమనార్హం.ప్రముఖ డిజైనర్లలో ఒకరైన ఆనంద్‌ కబ్రా ఈ చీరను డిజైన్ చేశారు.

Telugu Actressshriya, Rajamouli, Ram Charna, Rrr, Sarees, Shriya, Shriya Saran,

ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియ కీలక పాత్రలో కనిపించారు.ఈ సినిమాలో శ్రియ పాత్ర నిడివి తక్కువే అయినా సినిమాకు కీలకంగా ఉంటుందని సమాచారం అందుతోంది.రాజమౌళి ఛత్రపతి తర్వాత శ్రియకు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.

Telugu Actressshriya, Rajamouli, Ram Charna, Rrr, Sarees, Shriya, Shriya Saran,

మరో పది రోజుల్లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుండగా ఈ సినిమాతో శ్రియ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.శ్రియతో పాటు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.శ్రియ మాత్రం వచ్చిన సినిమా ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు.

అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న శ్రియకు సీనియర్ డైరెక్టర్లతో పాటు యంగ్ డైరెక్టర్లు కూడా తమ సినిమాలలో ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube