ఏడాదికి మించి ఇండస్ట్రీలో ఉండలేవన్నారు.. నటి సంచలన వ్యాఖ్యలు..?

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించారు.

 Interesting Facts About Star Heroine Shraddha Srinath-TeluguStop.com

అందం, అభినయం పుష్కలంగా ఉన్న శ్రద్ధా శ్రీనాథ్ తన నటనతో విమర్శల ప్రశంసలను సైతం అందుకున్నారు.భిన్నమైన కథలను ఎంచుకుంటూ శ్రద్ధా శ్రీనాథ్ నటిగా సినీ కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రద్ధా శ్రీనాథ్ నాన్న ఆర్మీ మ్యాన్ కావడంతో తరచూ ఆయనకు బదిలీలు జరిగేవని చెప్పుకొచ్చారు.ప్లస్ టూ చదివే సమయానికి తాను ఏకంగా తొమ్మిది పాఠశాలలు మారానని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పుకొచ్చారు.

 Interesting Facts About Star Heroine Shraddha Srinath-ఏడాదికి మించి ఇండస్ట్రీలో ఉండలేవన్నారు.. నటి సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాను చిన్న వయస్సులోనే దేశంలోని చాలా ప్రాంతాలను చూశానని శ్రద్ధా శ్రీనాథ్ వెల్లడించారు.తాను లా చదివానని రెండు సంవత్సరాలు న్యాయవాదిగా పని చేశానని చెప్పుకొచ్చారు.

Telugu Interesting Facts, Jersey Movie Heroine, Key Comments, Movie Industry, One Year, Shradda Srinath, Solo Travel, Star Heroine, Tollywood-Movie

కన్నడలో యూటర్న్ తన తొలి సినిమా అని శ్రద్దా శ్రీనాథ్ చెప్పుకొచ్చారు.నటిగా సంతృప్తి ఇచ్చిన సినిమాల్లో మాత్రమే తాను నటించానని ఆమె అన్నారు.లా చదివే సమయంలో లైఫ్ ను బాగా ఎంజాయ్ చేశానని అయితే చదువును మాత్ర నిర్లక్ష్యం చేయలేదని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పుకొచ్చారు.సినిమాల్లోకి తాను ఎంట్రీ ఇచ్చిన సమయంలో సంవత్సరం కంటే ఎక్కువ సమయం ఇండస్ట్రిలో ఉండనని చాలామంది భావించారని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పుకొచ్చారు.

Telugu Interesting Facts, Jersey Movie Heroine, Key Comments, Movie Industry, One Year, Shradda Srinath, Solo Travel, Star Heroine, Tollywood-Movie

తాను సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆరు సంవత్సరాలు అవుతోందని ఆమె చెప్పుకొచ్చారు.తనకు సోలో ట్రావెల్ ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు.తనకు సాహస యాత్రలు చేయడం ఇష్టమని ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేస్తామని ఆమె చెప్పుకొచ్చారు.అయితే ఈ బ్యూటీకి స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఆఫర్లు రావడం లేదు.

స్టార్స్ సినిమాల్లో నటిస్తే మాత్రం ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

#Solo Travel #Shradda Srinath #One Year #Key Comments #JerseyMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు