వామ్మో.. స్టార్ హీరోయిన్ సమంతకు ఇన్ని వ్యాపారాలు ఉన్నాయా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా మంచి వ్యక్తి అని ఇతరులకు సహాయం చేసే విషయంలో సమంత ముందువరసలో ఉంటారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.అయితే చాలామంది అభిమానులకు సమంత హీరోయిన్ గా మాత్రమే తెలిసినా ఆమె వ్యాపారవేత్త కూడా కావడం గమనార్హం.

 Interesting Facts About Star Heroine Samantha Details, Career Planning, Interest-TeluguStop.com

తాజాగా సమంత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హాజరై ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించారు.

సమంత షోలో సరదాగా ఎన్నో ముచ్చట్లను చెప్పుకొచ్చారు.

అదే సమయంలో ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు వేగంగా సమాధానాలు చెప్పి తను చాలా టాలెంటెడ్ అని సమంత ప్రూవ్ చేసుకున్నారు.సమంతకు సొంతంగా సాకీ పేరుతో క్లాత్స్ ఔట్ లెట్ ఉందనే సంగతి తెలిసిందే.

మన దేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం సమంత సాకీ బ్రాండ్ కు మంచి ఆదరణ ఉంది.అయితే సమంత సొంతంగా ఆర్గానిక్ ఫామింగ్ ను నిర్వహించడంతో పాటు ప్రీ స్కూల్ ను కూడా నిర్వహిస్తున్నారు.

ఈ విధంగా సమంత వ్యాపారాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.భవిష్యత్తులో సమంత మరిన్ని రంగాల్లో ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

Telugu Career, Evarumeelo, Prathyusha, Saki, Samantha-Movie

మరోవైపు ప్రత్యూష సపోర్ట్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు వైద్య సహాయం అందేలా చేస్తున్నారు.ఒకవైపు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా సమంత తన సేవా కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తుండటం గమానార్హం.

Telugu Career, Evarumeelo, Prathyusha, Saki, Samantha-Movie

తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే సత్తా చాటిన సమంత బాలీవుడ్ లో కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.పాన్ ఇండియా సినిమాలపై సమంత దృష్టి పెట్టారని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. సమంత తెలుగులో కొత్తగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దసరా రోజున ఆ సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube