స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తల్లీదండ్రుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తెలుగులో నటించిన సినిమాలలో ఫ్లాపైన సినిమాల కంటే హిట్టైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా వరుస ఆఫర్లతో రష్మిక మందన్నా బిజీగా ఉన్నారు.

 Interesting Facts About Star Heroine Rashmika Parents Details Here , Madan Mandanna, Rashmika, Rashmika Parents, Suman Mandanna, Schocking Facts-TeluguStop.com

నేషనల్ క్రష్ గా గుర్తింపును సంపాదించుకున్న రష్మిక సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉండటం గమనార్హం.

తాజాగా రష్మిక తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

 Interesting Facts About Star Heroine Rashmika Parents Details Here , Madan Mandanna, Rashmika, Rashmika Parents, Suman Mandanna, Schocking Facts -స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తల్లీదండ్రుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది మందన్నా ఫ్యామిలీ అని చెప్పడం సంతోషంగా ఉంది అని ఆమె కామెంట్లు చేశారు.తన కుటుంబ సభ్యులు ఎప్పుడూ తన ఫేస్ పై చిరునవ్వును తీసుకొస్తారని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తుంటాం అని చెబుతూ రష్మిక మందన్నా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

స్టార్ హీరోయిన్ రష్మికకు తల్లీదండ్రులతో పాటు ఒక సిస్టర్ కూడా ఉంది.

రష్మిక చెల్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.రష్మిక షేర్ చేసిన ఫోటోకు 16 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో సులభంగానే అర్థమవుతుంది.

రష్మిక మందన్న ఫాదర్ పేరు మదన్ మందన్న అని ఈయన కాఫీ ఎస్టేట్ యజమాని అని తెలుస్తోంది.

మదన్ మందన్న విరాజ్ పేట అనే ప్రాంతంలో సొంతంగా కాఫీ ఎస్టేట్ ను కలిగి ఉన్నారని ఆయనకు విరాజ్ పేటలో సెరినిటీ అనే హాల్ కూడా ఉందని తెలుస్తోంది.రష్మిక మందన్నా తల్లి పేరు సుమన్ మందన్నా కాగా ఈమె కూతురు కెరీర్ లో మరింత ఉన్నత స్థితికి ఎదిగేందుకు తన వంతు కృషి చేస్తుండటం గమనార్హం.రష్మిక తర్వాత సినిమాలతో విజయాలను అందుకుంటారో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube