అతనే నా క్రష్.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన మెహ్రీన్..?

నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మెహ్రీన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈ మధ్య కాలంలో సినిమాల కంటే భవ్య భిష్ణోయ్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం ద్వారానే మెహ్రీన్ వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Star Heroine Mehreen, Doctor,  Crush,  Interesting Facts-TeluguStop.com

తాజాగా ఒక సందర్భంలో మెహ్రీన్ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.పంజాబీ ముద్దుగుమ్మ అయిన మెహ్రీన్ తాను సినిమా ఇండస్ట్రీలోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చానని చెబుతున్నారు.

నాన్నకు తనను ఐఏఎస్ ఆఫీసర్ ను చేయలనే లక్ష్యం ఉండేదని ఎవరిని కలిసినా వాళ్లలా అవ్వాలని తాను అనుకునేదానినని ఒక సమయంలో దలైలామా కావాలంటే ఏం చేయాలని కూడా తాను ఆలోచించానని మెహ్రీన్ చెప్పుకొచ్చారు.పది సంవత్సరాల వయస్సులోనే మెహ్రీన్ ర్యాంప్ వాక్ చేశారు.

కెరీర్ తొలినాళ్లలో కొన్ని యాడ్స్ లో నటించిన మెహ్రీన్ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Telugu Anushka Shetty, Crush, Mehreen, Salaman Khan, Tollywood-Movie

సరైనోడు మూవీ అడిషన్స్ కు హాజరైన మెహ్రీన్ కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమా చేయలేకపోయారు.చిన్నప్పటి నుంచి తనకు ఫ్యామిలీ డాక్టర్ అంటే క్రష్ ఉండేదని ఫ్యామిలీ డాక్టర్ చాలా అందంగా ఉండేవారని మెహ్రీన్ తెలిపారు.అమ్మతో డాక్టర్ దగ్గరకు వెళ్లాలని తాను అడిగేదానినని మెహ్రీన్ చెప్పుకొచ్చారు.

సల్మాన్, అనుష్క శెట్టి అంటే తనకు ఇష్టమని తాను ఏదైనా అబద్ధం చెబితే ముఖం ఎర్రగా అవుతుందని మెహ్రీన్ పేర్కొన్నారు.

Telugu Anushka Shetty, Crush, Mehreen, Salaman Khan, Tollywood-Movie

అమెరికా అంటే తనకు ఇష్టమని ఇప్పటికీ ఛాన్స్ దొరికితే అమెరికాకు వెళతామని ఆమె చెప్పారు.రాగిముద్ద ఇష్టంగా తింటానని పుస్తకాలు చదవడం, డ్యాన్స్ చేయడం తనకు ఇష్టమని మెహ్రీన్ పేర్కొన్నారు.ఏ పని అయినా ఆసక్తి లేకపోతే మొదలుపెట్టనని మొదలుపెడితే మాత్రం కచ్చితంగా పూర్తి చేస్తానని మెహ్రీన్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube