మహానటి సావిత్రి ఆస్తులు ఆమ్ముకోవడానికి కారణమైన సినిమా ఏదో తెలుసా?

Interesting Facts About Star Heroine Mahanati Savitri Movies

సినిమా రంగంలో పేరు, గుర్తింపు సంపాదించుకున్న వాళ్లకు పారితోషికాలు ఊహించని స్థాయిలో ఉంటాయి.స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ల వల్ల సినిమాలకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతుంది కాబట్టి దర్శకనిర్మాతలు సైతం భారీ బడ్జెట్ సినిమాలలో స్టార్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

 Interesting Facts About Star Heroine Mahanati Savitri Movies-TeluguStop.com

తన నటనతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుని ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న నటీమణులలో సావిత్రి ఒకరు.

తెలుగు, తమిళంలో ఆనాటి స్టార్ హీరోలకు జోడీగా సావిత్రి నటించారు.

 Interesting Facts About Star Heroine Mahanati Savitri Movies-మహానటి సావిత్రి ఆస్తులు ఆమ్ముకోవడానికి కారణమైన సినిమా ఏదో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సినిమాల ద్వారా ఎంతో సంపాదించిన సావిత్రి జీవితం విషాదాంతం కావడం గమనార్హం.సావిత్రికి ఎడమ చేతివాటం కాగా సావిత్రి రాయడం, సిగ్నేచర్ చేయడం అన్నీ ఎడమ చేతితోనే చేసేవారు.

నర్తనశాల సినిమా కోసం సావిత్రి ఏకంగా 12 గంటల పాటు పని చేశారు.సావిత్రి వాహనాలను వేగంగా నడిపేవారు.

ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఆమె కారులో కూర్చునేవాళ్లు గజగజా వణికేవాళ్లు.

ఎవరైనా ఎందుకు వేగంగా కారును నడుపుతున్నారని అడిగితే అవకాశం వచ్చిన ప్రతిసారి తాను వాహనాన్ని వేగంగానే నడుపుతానని ఆమె చెప్పేవారు.

Telugu Chinnari Papalu, Mooga Manasulu, Narthanashala, Savitri, Savitrisold, Vinta Samsaram-Movie

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి కారులో సాధారణంగా 40 నిమిషాల సమయం పడితే సావిత్రి మాత్రం కేవలం 20 నిమిషాల్లో వెళ్లిపోయేవారు.సావిత్రి డైరెక్షన్ లో వచ్చిన తొలి సినిమా చిన్నారి పాపలు కాగా వాటాదారులను నమ్ముకుని ఆమె చిత్రనిర్మాణంలోకి దిగారు.

Telugu Chinnari Papalu, Mooga Manasulu, Narthanashala, Savitri, Savitrisold, Vinta Samsaram-Movie

సినిమా షూటింగ్ కొంతభాగం పూర్తైన తర్వాత సావిత్రిని ఊహించని ఇబ్బందులు చుట్టుముట్టాయి.సావిత్రి సొంత ఆస్తులు అమ్ముకునిసినిమాను పూర్తి చేశారు.ఆ తర్వాత కూడా సావిత్రికి సినీ నిర్మాణాలు కలిసిరాలేదు.వింత సంసారం, మూగ మనసులు, తమిళంలో తెరకెక్కిన ప్రాప్తం సినిమాలు ఆమెను ఇబ్బంది పెట్టాయి.ఈరోజు మహానటి సావిత్రి పుట్టినరోజు కావడం గమనార్హం.డి.వి.నరసరాజు పదిమందిని వెంటబెట్టుకొని సినీ నిర్మాణం జోలికి పోవద్దని చెప్పినా సావిత్రి మాత్రం వినలేదు.

#Mooga Manasulu #Savitri #Vinta Samsaram #SavitriSold #Chinnari Papalu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube