కాజల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంవత్సరాల తరబడి హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో కాజల్ ఒకరు.ఒకవైపు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూనే మరోవైపు గ్లామరస్ రోల్స్ చేస్తూ కాజల్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.

 Interesting Facts About Star Heroine Kajal Agarwal, Interesting Facts, Kajal Ag-TeluguStop.com

కాజల్ అగర్వాల్ పంజాబీ కుటుంబంలో జన్మించారు.కాజల్ పేరెంట్స్ ముంబైలో స్థిరపడటంతో ఆమె విద్యాభ్యాసం అక్కడే జరిగింది.

కాజల్ చదువు విషయానికి వస్తే ఆమె మాస్ కమ్యూనికేషన్ లో గ్రాడ్యుయేషన్ చేశారు.మోడలింగ్ చేసే సమయంలో హిందీలో కాజల్ ఒక సినిమాలో నటించారు.తమిళంలో బొమ్మాలాట్టమ్ సినిమాలో కాజల్ నటించగా ఆ సినిమా కంటే ముందే తెలుగులో లక్ష్మీ కళ్యాణం సినిమా విడుదలైంది.ఆ సినిమా సక్సెస్ సాధించకపోయినా రెండో మూవీ చందమామతో కాజల్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

Telugu Kajal Agarwal, Magadheera, Neneraju-Movie

అయితే చందమామ తరువాత కాజల్ నటించిన సినిమాలు సక్సెస్ సాధించలేదు.ఆ తరువాత మగధీర సినిమాలో హీరోయిన్ పాత్ర కాజల్ కెరీర్ ను మలుపు తిప్పింది.మిత్రవిందగా ఆమె ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు.ఆ సినిమా తరువాత కాజల్ నటించిన డార్లింగ్, బృందావనం, నా పేరు శివ, బిజినెస్ మేన్, బాద్ షా, తుపాకి, టెంపర్, ఖైదీ నంబర్ 150 సినిమాలు సక్సెస్ సాధించాయి.

Telugu Kajal Agarwal, Magadheera, Neneraju-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కాజల్ నటిగా సత్తా చాటడం గమనార్హం.కాజల్ కు మేడం టుస్సాడ్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అ, నేనేరాజు నేనే మంత్రి సినిమాలలో భిన్నమైన పాత్రలు చేసి కాజల్ తన నటనతో మెప్పించారు.నటిగా ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అనే స్పెషల్ సాంగ్ చేసి ఆ సాంగ్ తో కాజల్ సినిమాకు ప్లస్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube