స్టార్ హీరో ప్రభాస్ ఆలోచనలను మార్చిన సినిమా ఏదో మీకు తెలుసా?

ఇండస్ట్రీలో ఏ హీరో సక్సెస్ కావాలన్నా ఫస్ట్, సెకండ్ సినిమాల ఫలితాలు ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు.ఈశ్వర్ సినిమాలో గల్లీ కుర్రాడిగా కనిపించిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో స్టేటస్ తో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

 Interesting Facts About Star Hero Prabhas Details, Interesting Facts, Prabhas, P-TeluguStop.com

ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్, రెండో సినిమా రాఘవేంద్ర ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా వర్షం సినిమాతో ప్రభాస్ తొలి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

హిట్ ఫ్లాపులకు అతీతంగా మార్కెట్ ను పెంచుకుంటూ ప్రభాస్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.

విజయవాడలో స్కూలింగ్, హైదరాబాద్ లో ఇంటర్ చదివిన ప్రభాస్ సినిమా రంగానికి చెందిన కుటుంబంలోనే పుట్టినా హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదు.అయితే ప్రభాస్ స్నేహితులు, బంధువులు మాత్రం హీరోలా ఉన్నావని కామెంట్లు చేసేవారు.

కృష్ణంరాజు సినిమాల షూటింగ్ లు జరిగే సమయంలో ప్రభాస్ కూడా షూటింగ్ లకు వెళ్లేవారు.

అయితే ఆ సమయంలో ప్రభాస్ కు యాక్టింవ్ అంత సులభం కాదనే విషయం అర్థమైంది.

Telugu Bahubali, Bhakta Kannappa, Bollywood, Eeshwar, Krishnam Raju, Prabhas, Pr

పెదనాన్న కృష్ణంరాజుకు వీరాభిమాని అయిన ప్రభాస్ కు ఇష్టమైన సినిమా భక్త కన్నప్ప కావడం గమనార్హం.ఆ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ తన ఆలోచనలను మార్చుకొని హీరో కావాలని అనుకున్నారు.చాలామంది బాహుబలి సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ తెరపై కనిపించారని అనుకుంటారు.కానీ ఆ సినిమా కంటే ముందే ప్రభాస్ బాలీవుడ్ లో సత్తా చాటారు.

Telugu Bahubali, Bhakta Kannappa, Bollywood, Eeshwar, Krishnam Raju, Prabhas, Pr

ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ జాక్షన్ అనే మూవీలో ప్రభాస్ ఒక స్పెషల్ సాంగ్ చేశారు.ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాసినిమాకు ప్రభాస్ మార్కెట్ పెరుగుతోంది.ఎప్పుడైనా వర్క్ ప్రెజర్ అనిపిస్తే ప్రభాస్ తన స్నేహితులకు కాల్ చేసి వాళ్లతో సరదాగా కబుర్లు చెబుతారు.హీరోగా స్థాయి పెరిగినా ప్రభాస్ స్నేహం విషయంలో ఏ మాత్రం మారలేదని అతని స్నేహితులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube