మోహన్ బాబు పెదరాయుడు సినిమాను వదులుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Interesting Facts About Star Hero Mohan Babu Pedarayudu Movie

ప్రతి హీరో కెరీర్ లో కొన్ని సినిమాలు స్పెషల్ సినిమాలుగా నిలుస్తాయి.స్టార్ హీరో మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో పెదరాయుడు సినిమా కూడా ఒకటి.

 Interesting Facts About Star Hero Mohan Babu Pedarayudu Movie-TeluguStop.com

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో హీరోయిన్లుగా భానుప్రియ, సౌందర్య నటించారు.1995 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో రజినీకాంత్ పాపారాయుడి పాత్రలో నటించారనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Star Hero Mohan Babu Pedarayudu Movie-మోహన్ బాబు పెదరాయుడు సినిమాను వదులుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నాట్టామై సినిమాకు ఈ సినిమా రీమేక్ కావడం గమనార్హం.

వరుస ఫ్లాపులతో మోహన్ బాబు కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో పెదరాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

రజినీకాంత్ ఈ సినిమాలోని పాత్ర కోసం పారితోషికం తీసుకోలేదు.

మోహన్ బాబు ఆస్తులను తాకట్టు పెట్టి ఈ సినిమాను నిర్మించడం గమనార్హం.

Telugu Gopal, Balakrishna, Bhanu Priya, Gopal, Mohan Babu, Pedarayudu, Rajnikanth, Raviraja, Simhadri, Soundarya-Movie

ఘరానా మొగుడు సినిమాతో చిరంజీవి క్రియేట్ చేసిన రికార్డులు ఈ సినిమాతో బ్రేక్ అయ్యాయి.అయితే ఈ సినిమాకు దర్శకుడిగా మొదట బి.గోపాల్ ఎంపికయ్యారు.అయితే బి.గోపాల్ కు వేరే సినిమా కమిట్మెంట్ ఉండటం వల్ల ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.

Telugu Gopal, Balakrishna, Bhanu Priya, Gopal, Mohan Babu, Pedarayudu, Rajnikanth, Raviraja, Simhadri, Soundarya-Movie

ఒకవేళ బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించి ఉంటే మాత్రం ఈ సినిమా బి.గోపాల్ కెరీర్ కు ప్లస్ అయ్యి ఉండేదని చెప్పవచ్చు.బి.గోపాల్ ఈ సినిమాతో పాటు సింహాద్రి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నారు. విజయేంద్ర ప్రసాద్, బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేయగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కింది.

#Gopal #Soundarya #Simhadri #Gopal #Bhanu Priya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube