బాలయ్య విషయంలో ఆ డైరెక్టర్ ను మందలించిన ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో బాలకృష్ణ సక్సెస్ ఫెయిల్యూర్లకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.మరో ఆరు రోజుల్లో బాలయ్య నటించిన అఖండ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

 Interesting Facts About Star Hero Balakrishna  Disco King Palnati Puli Movies De-TeluguStop.com

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగనుండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా ఈవెంట్ కు అతిథిగా హాజరు కానున్నారు.బాలయ్య ఖాతాలో అఖండతో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

సీనియర్ డైరెక్టర్ తాతినేని ప్రసాద్ ఒక ఇంటర్యూలో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.బాలకృష్ణ కెరీర్ తొలినాళ్లలో రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే ఎక్కువగా నటించేవారని తాతినేని ప్రసాద్ తెలిపారు.

ఒక నిర్మాత హిందీలో సక్సెస్ సాధించిన డిస్కో డ్యాన్సర్ అనే సినిమా హక్కులు కొనుగోలు చేసి ఆ సినిమాను తెలుగులో తెరకెక్కించాలని తనను కోరారని తాతినేని ప్రసాద్ పేర్కొన్నారు.

ఆ సినిమాలో బాలయ్యను ఎంపిక చేద్దామని తాను చెప్పానని సీనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడి తాను ఒప్పిస్తానని నిర్మాతకు మాటిచ్చానని తాతినేని ప్రసాద్ వెల్లడించారు.

Telugu Balakrishna, Balakrishna Leg, Tatineni Prasad, Minor Fracture, Palnati Pu

సెక్రటేరియట్ లో రామారావును కలిసి బాలకృష్ణతో సినిమా చేయడానికి ఒప్పించానని తాతినేని ప్రసాద్ పేర్కొన్నారు.బాలయ్యతో డిస్కో కింగ్ పేరుతో ఆ సినిమాను తెరకెక్కించామని చేయాలి అనుకుంటే బాలయ్య కష్టమైన సీన్స్ లో కూడా నటిస్తారని తాతినేని ప్రసాద్ చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Balakrishna Leg, Tatineni Prasad, Minor Fracture, Palnati Pu

బాలయ్యతో పల్నాటి పులి సినిమాను కూడా తెరకెక్కించానని ఆ సినిమాలో రిక్షా తోలే వ్యక్తిగా బాలయ్య నటించారని షూటింగ్ సమయంలో బాలయ్య కాలికి మైనర్ ఫ్రాక్చర్ అయిందని సీనియర్ ఎన్టీఆర్ గారు పిలిపించి మందలించారని తాతినేని ప్రసాద్ చెప్పుకొచ్చారు.ఫాదర్ గా నాకు బాధ ఉంటుందని బాలయ్యను జాగ్రత్తగా చూసుకోవాలని సీనియర్ ఎన్టీఆర్ తనతో చెప్పారని తాతినేని ప్రసాద్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube