స్టార్ కిడ్ అయినా రిక్షాలోనే స్కూల్ కు వెళ్లేదాన్ని.. ఇషాడియోల్ షాకింగ్ కామెంట్స్!

మనలో చాలామంది సెలబ్రిటీలకు ఎటువంటి కష్టాలు ఉండవని అనుకుంటారు.అయితే స్టార్ కిడ్ అయినప్పటికీ తను ఎన్నో కష్టాలను అనుభవించానని ఇషా డియోల్ చెప్పుకొచ్చారు.

 Interesting Facts About Star Heoine Esha Deol-TeluguStop.com

బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ కపుల్స్ లో ధర్మేంద్ర హేమా మాలిని జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.ధర్మేంద్రకు హేమా మాలిని రెండో భార్య కాగా ఈ దంపతులకు అహనా డియోల్, ఇషా డియోల్ పేర్లతో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

అహనా డియోల్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా ఇషా డియోల్ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు.తాజాగా ఇషా డియోల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Interesting Facts About Star Heoine Esha Deol-స్టార్ కిడ్ అయినా రిక్షాలోనే స్కూల్ కు వెళ్లేదాన్ని.. ఇషాడియోల్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన తల్లిదండ్రుల గొప్పదనం గురించి ఇషాడియోల్ చెప్పుకొచ్చారు.తన తల్లి, తండ్రి ఇద్దరూ సూపర్ స్టార్స్ అని అయినప్పటికీ తల్లిదండ్రులు ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ ఉండేవారని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu About Her Life, About Her School Life, Ahana Deol, Bollywood, Dharmendra, Dhramedra, Esha Deol, Hama Malini, Hema Malini, Interesting Facts, Rikshaw-Movie

తన తల్లిదండ్రులు తమను ఎంతో బాగా పెంచారని సాధారణంగానే తన బాల్యం గడిచిందని ఇషా డియోల్ అన్నారు.పాఠశాలలో చదివే సమయంలో కూడా తనను, తన చెల్లిని ఎవరూ స్టార్ కిడ్ లా చూసేవారు కాదని ఆమె చెప్పుకొచ్చారు.తాను, తన చెల్లి పాఠశాలకు రోజూ రిక్షాలోనే వెళ్లేవాళ్లమని ఆమె అన్నారు ఏక్ దువా అనే సినిమాతో ఇషా డియోల్ మంచి పేరును సొంతం చేసుకున్నారు.

Telugu About Her Life, About Her School Life, Ahana Deol, Bollywood, Dharmendra, Dhramedra, Esha Deol, Hama Malini, Hema Malini, Interesting Facts, Rikshaw-Movie

ఇషా డియోల్ చేతిలో పలు సినిమా ఆఫర్లు ఉండగా ఇతర భాషల నుంచి కూడా ఈ బ్యూటీకీ ఆఫర్లు వస్తున్నాయి.ఇషా డియోల్ ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేదు.తరువాత సినిమాలతో ఇషా స్టార్ స్టేటస్ ను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీకి భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

#Rikshaw #Ahana Deol #Hema Malini #School #Dharmendra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు